దేశంలోనే లెజెండరీ దర్శకుడిగా వెటరన్ మణిరత్నం కి ఉన్న గౌరవం గుర్తింపు వేరు. ఆయన తెరకెక్కించిన క్లాసిక్స్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో ఆయన ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. క్లాసిక్స్ గా భావించి భారీ బడ్జెట్లతో తీస్తున్నవి కూడా మెప్పించడంలో తడబాటుకు గురవుతున్నాయి.
తాజాగా మణిరత్నం తెరకెక్కించిన భారీ హిస్టారికల్ ఎపిక్ మూవీ `పొన్నియన్ సెల్వన్ -1` తమిళ ఆడియెన్ ని మెప్పిస్తున్నా కానీ ఇతర భాషల్లో ఆశించినంత ప్రభావం చూపడంలో తడబడింది. ఈ సినిమాపై తెలుగు క్రిటిక్స్ పెదవి విరిచేసారు. చాలా మంది బాహుబలితో పోలికను చూసారు. పీఎస్ 1 స్క్రీన్ ప్లే గురించి విమర్శించారు. పీఎస్ 1 కి పాన్ ఇండియా రీచ్ కనిపించలేదన్నది వాస్తవం.
అయితే తాజాగా కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` తమిళ ప్రమోషన్స్ లో పీఎస్ 1పై ప్రశంసలు కురిపించారు. తన సినిమా ప్రమోషన్ కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగ్ కొన్ని ఆసక్తికర ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మణిరత్నం తాజా పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ పై నాగార్జున అభిప్రాయాన్ని తమిళ మీడియా కోరింది. సినిమా చాలా బాగుందని తాను కూడా పుస్తకాన్ని చదివానని నాగార్జున అన్నారు.
PS-1 .. బాహుబలి మధ్య పోలికల గురించి విలేకరులు అడిగారు. వాటిపై స్పందించిన నాగ్.. ``వారి (పోలికలు చూసేవారి) మాటలు వినవద్దు`` అని అన్నారు.
పొన్నియిన్ సెల్వన్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళనాట బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు- హిందీలో అంతంత మాత్రంగా వసూళ్లను సాధించింది. ఈ పీరియడ్ డ్రామా లో విక్రమ్- జయం రవి- కార్తీ- ఐశ్వర్యరాయ్- త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో మణిరత్నం మార్క్ సంభాషణలు అలరించాయి. నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందిన `ది ఘోస్ట్` రేపు విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో నటించింది. స్పై ఆపరేషన్ నేపథ్యంలో ఆసక్తికర చిత్రమిది.
మణిరత్నంతో సుదీర్ఘ అనుబంధం
అక్కినేని కుటుంబంతో మణిరత్నం అనుబంధం చాలా సుదీర్ఘమైనది. ఆయన నాగార్జున తో తొంబైలలోనే `గీతాంజలి` అనే క్లాసిక్ ని తెరకెక్కించారు. ఆ తర్వాత కూడా నాగార్జునతో కలిసి పని చేయాలని మణిరత్నం పలుమార్లు ప్రయత్నించినా రకరకాల కారణాలతో కుదరలేదు. మునుముందు వీరి కలయికలో ఏదైనా మల్టీస్టారర్ సినిమాకి ఆస్కారం లేకపలేదని గుసగుస వినిపిస్తోంది.
దర్శకుడికి నాగార్జున సలహా ఇదే
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించిన తాజా చిత్రం `ది ఘోస్ట్` పాన్ ఇండియా కేటగిరీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నాగ్ మాజీ ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండగా భారీ బజ్ ని సృష్టించేందుకు దర్శక నిర్మాతలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
తాజా ఇంటర్వ్యూలో ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని స్టైలిష్ ఎంటర్ టైనర్ గా అభివర్ణించిన దర్శకుడు.. యాక్షన్ సన్నివేశాలు కథను ముందుకు నడిపిస్తాయని వాటిని సినిమాలో గేర్ మార్చేందుకు ఉపయోగించానని చెప్పారు. ``నాగ్ సార్ ఆట `సింపుల్ గా ఉండాలి..క్లిష్టతరం చేయవద్దు`` అని మాత్రమే చెప్పారు. ఆ సూచన పాటించి ఈ సినిమాని తెరకెక్కించానని తెలిపారు. ఇందులో సోనాల్ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం సోనాల్ మార్షల్ ఆర్ట్స్‌లో కఠినమైన శిక్షణ పొందింది.. అని అతడు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.