టాలీవుడ్ లో 2022 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా మారనుంది. చాలా ఏళ్ళ తర్వాత స్టార్ హీరోలందరూ ఒకేసారి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రాన్ని వచ్చే జనవరి 13న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ ని కూడా పెద్ద పండక్కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' కూడా సంక్రాంతి రేసులోకి రాబోతోంది. ఇప్పుడు కింగ్ అక్కినేని నాగార్జున ''బంగార్రాజు'' కూడా సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నాగార్జున కెరీర్ లో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి ప్రీక్వెల్ గా ''బంగార్రాజు'' అనే చిత్రాన్ని తలపెట్టారు. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. గత రెండేళ్లుగా స్క్రిప్ట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు నాగ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. దీని కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్ నిర్మాణం చేపడుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవడంతో ఆగస్టు 20న ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
'బంగార్రాజు' చిత్రంలో నాగార్జున తో పాటుగా తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య కూడా నటించనున్నారు. నాగ్ కు జోడీగా రమ్యకృష్ణ నటించనుండగా.. చైతూ సరసన కృతి శెట్టి కనిపించనున్నట్లు తెలిసింది. ఈనెల 20 నుంచి ప్రారంభయ్యే షూట్ లో ముందుగా నాగార్జున - రమ్యకృష్ణలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు 'బంగార్రాజు' చిత్రాన్ని 2022 సంక్రాంతి సీజన్ లక్ష్యంగా షూటింగ్ జరుపనున్నారని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి జనవరి 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అంటున్నారు.
నిజానికి 'వైల్డ్ డాగ్' ప్రమోషన్స్ సమయంలోనే నాగార్జున 'బంగార్రాజు' చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఆ సెంటిమెంట్ తో ప్రీక్వెల్ ని కూడా అదే సీజన్ లో విడుదల చేయాలని నాగ్ అప్పుడు భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల లేట్ అయిన సినిమాలన్నీ ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేసాయి. అందులోనూ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన చిత్రాలన్నీ స్టార్ హీరోలవే. వీటితో పాటుగా 'బీస్ట్' వంటి డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇదంతా చూసుకుంటే మంచి వసూళ్లు ఆశించే ఏ ఇతర హీరోలు కూడా 2022 సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని అనుకోరు. అలాంటిది బిజినెస్ మైండ్ అయిన నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరో ''బంగార్రాజు'' చిత్రాన్ని టఫ్ ఫైట్ లో పోటీలో దింపాలని చూస్తారా అన్నది అనుమానమే. దీనికి తోడు అవన్నీ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు.. చిత్రీకరణ చివరి దశలో ఉన్న చిత్రాలు. నాగ్ - చైతూ సినిమా ఇంకా స్టార్ట్ కూడా అవలేదు. ఇతర కమిట్మెంట్స్ పక్కన పెట్టి ఈ చిత్రాన్ని అప్పటికి కంప్లీట్ చేయడం కూడా కష్టం అవ్వొచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
ఇకపోతే 'మనం' వంటి క్లాసిక్ సినిమా తర్వాత నాగార్జున - నాగచైతన్య కలిసి నటించే చిత్రం ''బంగార్రాజు'' అవుతుంది. తండ్రీకొడుకులు కలిసి నటించే చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. చైతన్య 'థాంక్యూ' సినిమాతో పాటుగా 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ సినిమా చేస్తున్నారు.