అఖిల్ సినిమాకి బడ్జెట్ అలా ఫిక్స్?

Update: 2016-11-19 05:24 GMT
అక్కినేని అఖిల్ మొదటి మూవీ అఖిల్ నిరుత్సాహపరిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండో సినిమా ఎంపికలో అక్కినేని టీం మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న తర్వాత ఎట్టకేలకు విక్రమ్ కె కుమార్ తో అఖిల్ సెకండ్ ను ఫైనల్ చేశారు.

అఖిల్ రెండో మూవీపై చాలానే ఎలర్ట్స్ తీసుకున్న నాగ్.. అఖిల్ ను తనకు మనం లాంటి మూవీ ఇఛ్చిన విక్రమ్ కె కుమార్ కు అప్పగించిన తర్వాత.. రిలీఫ్ ఫీలయ్యారని చెప్పాలి. ఇప్పుడీ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు.. రీసెంట్ గా నాగార్జునను కలిసి బడ్జెట్ డీటైల్స్ డిస్కస్ చేశాడు. మొత్తం మూవీ బడ్జెట్ ను 40 కోట్లుగా కోట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ బడ్జెట్ కు నాగ్ దగ్గర అభ్యంతరాలు లేకపోయినా.. మరింత తగ్గించేందుకు చూడాల్సిందిగా చెప్పాడట.

మొదటి మూవీ అఖిల్ విషయంలో ఎక్కువ బడ్జెట్ కేటాయించడం.. సినిమా స్థాయిలో మార్పు తెచ్చింది. ఇప్పుడు కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తే.. అంత మొత్తాన్ని రాబట్టాల్సి ఉంటుంది. అందుకే కమర్షియల్ సక్సెస్ చేసేందుకుగాను.. తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేయాలని దర్శకుడు విక్రమ్ కె కుమార్ కు చెప్పాడట నాగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News