కింగ్ నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య... నాగ్ కోరుకున్న స్టార్ స్టేటస్ పొందలేకపోయాడు. దాంతో ముద్దుల కొడుకు అఖిల్ ను ఎలాగైనా టాప్ స్టార్ ని చేసేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నాగ్ ప్రయత్నాలేవీ సక్సెస్ కావట్లేదు. మనోడు రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. ఇంతలో అనుకోకుండా మొహమాటం కొద్దీ రామ్ గోపాల్ వర్మతో అఖిల్ సినిమాకి కమిట్ అయ్యాడు నాగ్.
అప్పుడెప్పుడో అక్కినేని నాగార్జునకి ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఆ అభిమానంతో వరుసగా మరో రెండు సినిమాలు చేశాడు నాగ్. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆర్జీవీ బాలీవుడ్ వెళ్లిపోయాడు. నాగ్ తనదైన స్టైలుతో ఇక్కడ సినిమాలు చేస్తూ పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకి నాగ్ ను కొత్త సినిమాకి ఒప్పించాడు వర్మ. చించేసే సినిమా తీస్తానంటూ ‘ఆఫీసర్’ సినిమా చెక్కుతున్నాడు. టీజర్ కూడా వచ్చేసింది. మళ్లీ వర్మ పనితనానికి మరోసారి ఫిదా అయిన నాగ్... చిన్న కొడుకు అఖిల్ తో సినిమా చేసేందుకు వర్మకి మాటిచ్చాడు. కానీ వర్మతో సినిమా అంటే హిట్టవ్వడం అటుంచితే.. ఎన్ని వివాదాలు వస్తాయో నాగ్ కి తెలియంది కాదు. సరైన హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న అఖిల్ తో సినిమా అంటే... అది కొరిమితో తలగొక్కున్నట్టే.
అందుకే ఆర్జీవీ- అఖిల్ సినిమాను ఎలా క్యాన్సిల్ చేయాలా... అని ఆలోచిస్తున్న నాగార్జునకి ఇప్పుడు పవన్ కల్యాణ్ - శ్రీరెడ్డి- వర్మల వివాదం మంచి కారణంగా దొరికింది. అంతే... ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేశాడు నాగ్. ఎందుకిలా అంటే... రామూ సినిమాలను టాలీవుడ్ బ్యాన్ చేయబోతుందనే వార్తను వంక చెబుతున్నాడంట ఈ మన్మథుడు. అయినా వర్మ సినిమాని క్యాన్సిల్ చేసి చాలామంచి పని చేశాడని సంతోషిస్తున్నారు అఖిల్ అభిమానులు.