అదీ సంగతి.. అఖిల్ కథ మారిందట

Update: 2017-01-31 16:21 GMT
అక్కినేని వంశంలో లేటెస్ట్ వారసుడు అక్కినేని అఖిల్ చేయబోయే రెండో సినిమా ఏంటి? ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి విక్రమ్ కే కుమార్ తో అఖిల్ రెండో సినిమా ఇప్పటికే ఖాయమైందనే వార్తలు ముందునుంచే ఉన్నాయి కానీ.. ఇప్పుడు అసలు విషయం బైటకు వచ్చింది.

అఖిల్ డిజాస్టర్ తర్వాత రెండో సినిమా కోసం.. ఇప్పటికే రెండో సినిమా ప్రారంభానికి 14 నెలలుగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమా ప్రారంభం కావాలి కానీ.. ఈ దర్శకుడు చెప్పిన స్టోరీలో సెకండాఫ్ పై నాగ్ అనుమానాలు వెలిబుచ్చాడట. దీంతో మరో కథను సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడట దర్శకుడు. కొత్త లైన్  విపరీతంగా నచ్చేయడంతో..  బడ్జెట్ విషయంలో ఆలోచించకుండా కంప్లీట్ స్క్రిప్ట్ తో వచ్చేస్తే సినిమా చేసేద్దామని చెప్పాడట నాగ్.

'నాకు ఆ రోజుల్లో శివ ఎలా ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిందో.. ఇప్పుడు అఖిల్ కు విక్రమ్ తో సినిమా కూడా అలా నిలిచిపోనుంది. విక్రం అంత పవర్ ఫుల్ స్టోరీ వినిపించాడు. ఎంత బడ్జెట్ అవుతుంది.. ఎప్పుడు స్టార్ట్  అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది' లాంటి విషయాలను నేను పట్టించుకోవడం లేదు అంటూ నాగ్ స్వయంగా చెప్పేశాడంటేనే.. ఈ సబ్జెక్ట్ పై నాగ్ కాన్ఫిడెన్స్ అర్ధమవుతుంది. మొత్తానికి కథ మారిపోయిందనే మాట అయితే వాస్తవం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News