మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా మోహన్ రాజా ఇప్పటికే తమిళనాట మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలుగు లో కూడా మంచి పేరును మోహన్ రాజా దక్కించుకున్నాడు. రీమేక్ దర్శకత్వం అంటే పెద్దగా దర్శకుడి గురించి మాట్లాడుకోవడం కనిపించదు.
కానీ గాడ్ ఫాదర్ దర్శకుడి విషయంలో మాత్రం అటు ఇటు అయ్యింది. మోహన్ రాజా గురించి ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఒక మంచి సినిమాను మెగాస్టార్ కి అందించాడు అంటూ మోహన్ రాజా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి కూడా మోహన్ రాజా పై ప్రశంసల వర్షం కురిపించడంతో దర్శకుడి గురించి ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.
లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్.. వినాయక్ తో పాటు పలువురు దర్శకులను పరిశీలించిన సమయంలో చివరకు మోహన్ రాజా అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించగా తాను నాగార్జున వందవ సినిమాకు కమిట్ అయ్యాను అంటూ ఆయన నుండి సమాధానం వచ్చిందట. దాంతో స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి నాగార్జునతో మాట్లాడాడట.
మోహన్ రాజా తో లూసిఫర్ రీమేక్ చేయాలని భావిస్తున్నాం. అందుకు మోహన్ రాజా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. అతడు నీతో సినిమా కమిట్ అయ్యాడు అని తెలిసింది. రీమేక్ కోసం అతడిని ఆరు నెలలు మాతో వర్క్ చేసేందుకు నీ నుండి గ్రీన్ సిగ్నల్ కావాలంటూ నాగార్జున ను చిరంజీవి అడిగాడట.
అందుకు నాగార్జున ఓకే చెప్పడంతో మోహన్ రాజా గాడ్ ఫాదర్ బాధ్యతలు చేపట్టాడు. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మన సినిమా చేద్దామని మోహన్ రాజా తో నాగార్జున అన్నాడట.
అలా గాడ్ ఫాదర్ సినిమా కార్యరూపం దాల్చడంలో నాగార్జున తనవంతు పాత్ర పోషించారు. నాగార్జున వందవ సినిమా కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.