తుపాకి ఇవ్వు.. నన్ను నేను కాల్చుకుంటా

Update: 2015-06-26 11:30 GMT
తండ్రి కొడుకుల అనుబంధం గురించి ముచ్చటించాలంటే టాలీవుడ్‌లో ఆ ఇద్దరినే తలుచుకోవాలి. ఆ ఇద్దరూ హీరోలుగా తెలుగు సినిమాని ఏలారంటే అతిశయోక్తి కాదు. అసలు తెలుగు సినిమా పురుడు పోసుకోవడానికే కారకుడు ఒకరైతే, దాన్ని తనదైన స్టయిల్‌తో, ఎక్స్‌పెరిమెంట్స్‌తో పీక్స్‌కి తీసుకెళ్లిన హీరో ఇంకొకరు. పద్మభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే డా||అక్కినేని నాగేశ్వరరావు, కింగ్‌ నాగార్జున గురించే ఇదంతా.

ఏఎన్నార్‌ నటించిన చిట్టచివరి సినిమా 'మనం' ఆన్‌సెట్స్‌ జరిగిన ఓ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. అక్కినేనికి క్యాన్సర్‌.. ఇక బతకరు. నెలరోజులే గడువు అని తెలుసు. ఆ క్షణం నుంచి ఆన్‌సెట్స్‌ అంతా మౌనం. అయినా ఆ నటదిగ్గజం తనకి ఏమీ కానట్టు యథావిధిగా రెగ్యులర్‌ షూటింగులో పాల్గొనేవారు. వీల్‌ చైర్‌లోనే వచ్చి తనకి ఇచ్చిన పని పూర్తి చేసి వెళ్లేవారు. రోజూ రెండు గంటలు వచ్చి నటించి వెళ్లేవారు. ఓ వైపు క్యాన్సర్‌ మహమ్మారీ నరాల్ని నులిమేస్తున్నా ఆ బాధను అణచుకుని ధీరుడిలా వృత్తికే చివరి క్షణం వరకూ అంకితమయ్యారు. ఆ బాధను కళ్లారా చూస్తూ నాగార్జున నిదురే లేని రాత్రులు గడిపారు.

ఓ సందర్భంలో శ్రీయతో తన బాధను చెప్పుకుంటూ.. ''గివ్‌ మి ఎ గన్‌. ఐ వాంట్‌ టు షూట్‌ మైసెల్ఫ్‌. ఐ కాంట్‌ సీ హిమ్‌ లైక్‌ దిస్‌'' అంటూ కుంగిపోయారు. తండ్రిపై తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇదొక్కటి చాలదూ? ఇలాంటి వాటిని తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఏఎన్నార్‌ అభిమానులకే కాదు అసలు ఏ అభిమానీ కానివాడికి కూడా అదే ఫీలింగ్‌ కలుగుతుంది కదూ!

Tags:    

Similar News