అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. నాగ్ ఫాలోయింగ్ తగ్గి.. మార్కెట్ పడిపోయిన స్థితిలో ఈ చిత్రం ఆయనకు అమితానందాన్ని కలిగించింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా షేర్ తో సంచలన విజయం సాధించింది. కానీ దీని తర్వాత నాగ్ ఆ సక్సెస్ ను నిలబెట్టుకునే సినిమాలు చేయలేదు. వరుస ఫ్లాపులతో ఆయన సతమతం అయ్యాడు. నాగ్ నుంచి చివరగా వచ్చిన ‘ఆఫీసర్’ పరిస్థితేంటో తెలిసిందే. ప్రస్తుతం నాగ్.. నానితో కలిసి ‘దేవదాసు’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు. దీని తర్వాత నాగ్ సోలో హీరోగా ఏ సినిమా చేస్తాడా అని అందరూ చూస్తుండగా.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ తెరమీదికి వచ్చింది. ఈ చిత్రం కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. సీనియర్ రైటర్ సత్యానంద్ కలిసి పని చేస్తున్నట్లు నాగ్ వెల్లడించాడు.
కళ్యాణ్ ‘బంగార్రాజు’ తీయాలని ముందు నుంచే ప్రయత్నిస్తున్నాడు. కానీ కథ కుదర్లేదు. అతను చెప్పిన కథ తనకు నచ్చలేదని ఇంతకుముందు మీడియాలో బహిరంగంగా చెప్పేశాడు నాగ్. ఒకటికి రెండు వెర్షన్లు వినిపించి ఫెయిలైన కళ్యాణ్.. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నాడు. కానీ అతడి చివరి సినిమా ‘నేల టిక్కెట్టు’ ఫలితం చూశాక అసలు కళ్యాణ్ ను నాగ్ ఇక నమ్ముతాడా అన్న సందేహాలు కలిగాయి. ఈ సినిమా దాదాపు ఆగిపోయినట్లే అనుకున్నారంతా. కానీ స్వయంగా నాగార్జునే ఈ సినిమా పని నడుస్తోందనడంతో దానిపై ఆసక్తి కలిగింది. ఐతే నాగార్జునను మెప్పించడం అంత సులువేమీ కాదు. నాగ్ ఆ ప్రస్తావన తెచ్చినంత మాత్రాన సినిమా ఉన్నట్లు కాదు. కళ్యాణ్ ఉన్న ఫాంలో అతడి మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్ తోనే ఉండి ఉంటాడు నాగ్. ఈ స్థితిలో ఆయన్ని మెప్పించే స్క్రిప్టు రెడీ చేయడం సవాలే. మరి ఈ సవాలును కళ్యాణ్ ఏమేరకు స్వీకరిస్తాడో చూడాలి.