తెలుగు బిగ్ బాస్ ప్రతి సీజన్ ఆరంభంలో కూడా సీపీఐ నారాయణ చేస్తున్న హడావుడి మీడియాలో చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ హౌస్ ని ఒక బ్రోతల్ హౌస్ అంటూ తీవ్రంగా విమర్శించిన నారాయణ ఇటీవల నానా హంగామా చేసిన విషయం తెల్సిందే. అన్నమయ్య చేసిన సమయంలో నాగార్జున కి చేతులు ఎత్తి దండం పెట్టాము.. ఇప్పుడు ఆయన్ను తిడుతున్నాం అంటూ బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేస్తున్నందుకు తీవ్ర విమర్శలు చేశాడు.
నారాయణ బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అంటూ సంభోదించడం పై కొందరు విమర్శలు చేస్తున్నారు. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే నాగార్జున తాజా ఎపిసోడ్ లో నారాయణ నారాయణ అంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిపడేశాడు అంటూ బిగ్ బాస్ అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున తాజా ఎపిసోడ్ లో నారాయణకి కౌంటర్ ఇచ్చేందుకు గాను జంటగా హౌస్ లో అడుగు పెట్టిన మెరీనా మరియు రోహిత్ లను వాడుకున్నాడు. వారిద్దరు కూడా పదే పదే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. అందరూ ఉన్నారంటూ తనను రోహిత్ హగ్ చేసుకోవడం లేదు అంటూ మెరీనా ఫిర్యాదు చేయడంతో.. నీకు ఏం సిగ్గు నీకు ఆ లైసెన్స్ ఉంది అంటూ నాగార్జున వారిద్దరిని హగ్ చేసుకొమన్నాడు.
మెరీనా మరియు రోహిత్ లు టైట్ హగ్ చేసుకోవాలంటూ నాగార్జున సూచించాడు. వారిద్దరు హగ్ చేసుకున్న సమయంలో నాగార్జున కాస్త ఫన్నీగా నారాయణ నారాయణ వారిద్దరు కూడా పెళ్లి అయిన వాళ్లు గమనించాలి అంటూ సీపీఐ నారాయణకి కౌంటర్ అన్నట్లుగా నాగార్జున వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
సీపీఐ నారాయణ అన్ని మాటలకు నాగార్జున కేవలం ఒకే ఒక్క కౌంటర్ తో సరి పెట్టాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే ఇప్పుడు నారాయణ ఏం స్పందిస్తాడు అనేది అందరికీ ఆసక్తిగా మారింది. నారాయణ ఎంతగా చెప్పినా బిగ్ బాస్ అనేది ఒక బ్రోతల్ హౌస్.. అందులో ఉన్న వారు మాత్రం వెదవలు అన్నట్లుగానే ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.