సొంత కథతోనే నాగ్ సినిమా..!

Update: 2022-12-10 15:30 GMT
ది ఘోస్ట్ అంటూ వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన నాగార్జున మళ్లీ మరో హిట్ పడే దాకా టెన్షన్ గానే ఉండాల్సిందే. అప్పటికే మూడు నాలుగు ఫ్లాపులు పడ్డాక బంగార్రాజుతో సూపర్ హిట్ కొట్టాడు నాగార్జున. ఘోస్ట్ తర్వాత నాగార్జున ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్నది కూడా క్లారిటీ రాలేదు. అయితే రైటర్ ప్రసన్న కుమార్ తో నాగ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా సినిమాల రైటర్ గా పనిచేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో నాగార్జునతో సినిమా చేస్తున్నట్టు చెప్పేశాడు. అయితే తన కథ రంగ్ దే బసంతి లానే ఉంటుందని చెప్పగా మీడియా అంతా కూడా నాగార్జున రంగ్ దే బసంది సినిమా రీమేక్ చేస్తున్నారని వార్తలు రాశారు.

వీటిపై ప్రసన్న కుమార్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నాగార్జున తో తాను తీస్తున్న సినిమా పీరియాడికల్ కథ అని.. రంగ్ దే బసంతి తరహాలో ఉంటుందని చెప్పాను కానీ ఆ సినిమా రీమేక్ గా కాదు. తన సొంత కథతోనే ఆ మూవీ వస్తుందని అన్నారు ప్రసన్న కుమార్. తన రైటింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన ప్రసన్న కుమార్ కెరీర్ లో ఫస్ట్ టైం మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. నాగార్జున సినిమాతో డైరక్షన్ గా మారడం అంటే అది లక్కీ హ్యాండ్ అన్నట్టే. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు.

సో ప్రసన్న కుమార్ కూడా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారే ఛాన్స్ ఉంది. ది ఘోస్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జున ఆ సినిమా ఫ్లాప్ తో డీలా పడ్డారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ గా చేస్తున్న నాగార్జున మరో రెండు వారాల్లో అది పూర్తి కాగానే ప్రసన్న కుమార్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని తెలుస్తుంది. నాగ్ తో పీరియాడికల్ సబ్జెక్ట్ అంటున్నాడు బడ్జెట్ కూడా నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ దాదాపుగా నాగార్జున సొంత బ్యానర్ లోనే ప్లాన్ చేస్తున్నారట.

ఎవరైనా ప్రొడక్షన్ చేస్తామని వచ్చినా సరే అన్నపూర్ణతో పాటుగా మరో సంస్థ కూడా కలిసి నిర్మించే ఛాన్స్ ఉందట. సో ఎలా లేదన్నా 2023 ఫస్ట్ హాఫ్ లోనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు.. సినిమా ఎంత బడ్జెట్ తో రాబోతుంది లాంటి మిగతా విషయాలన్ని త్వరలో ప్రేక్షకులకు తెలియచేస్తారు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News