నాగ్ ఎందుకు దాక్కుంటున్నాడో..

Update: 2018-01-09 09:51 GMT
అక్కినేని నాగార్జునకు వయసు మీద పడుతోందంటే.. చాలామందికి కోపం వచ్చేస్తుంది. ఎప్పటికీ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు అయిన నాగ్ ను అంత మాట అనడం ఎవరికీ నచ్చదు. పైగా కొన్ని రోజుల క్రితమే సిక్స్ ప్యాక్ రేంజ్ లో బాడీ చూపించిన నాగ్ ను అలా అనడం కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది.

కానీ ప్రస్తుతం నాగ్ రియాక్షన్స్ చూస్తుంటే అలా అనిపించక మానదు. సహజంగా ఓ మూవీ హిట్టు ఫెయిల్యూర్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోడు నాగార్జున. ఎలాంటి ప్రయోగాలకు అయినా సై అనే సత్తా ఉన్న ఈ స్టార్ హీరో.. అందుకు వచ్చే రిజల్ట్ కు కూడా ముందే ప్రిపేర్ అయిపోతాడు. కానీ ఎంత కాదన్నా నాగ్ వయసు ఇప్పుడు 58 సంవత్సరాలనే విషయం గుర్తుంచుకోవాలి. గతేడాది అఖిల్ నిశ్చితార్ధం రద్దు అయిన సమయంలో కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు నాగార్జున. మళ్లీ ఇప్పుడు ఆయన నమ్మకంపై దెబ్బ పడే సరికి అదే విధంగా రియాక్ట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. అఖిల్ కి సక్సెస్ అందించాలని ఎంతో కసిగా పని చేసిన ప్రాజెక్టు హలో.. అనుకున్న ఫలితం ఇవ్వలేదు.

నాగ్ స్వయంగా వస్తున్నాం కొడుతున్నాం అన్నాసరే ఆడియన్స్ పట్టించుకోలేదు. హలో ఎఫెక్ట్  నాగ్ మీద బాగా చూపించిందని... ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోలేకపోతున్నారని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అందుకే తన నిర్మాణంలోనే రూపొందిన రాజ్ తరుణ్ మూవీ రంగులరాట్నం ప్రమోషన్స్ కి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ తప్పు అనాలంటే.. నాగ్ స్వయంగా రంగంలోకి దిగాలి. మరి ఈ ప్రచారాన్ని నాగ్ పట్టించుకుంటారో లేదో?
Tags:    

Similar News