ఓం నమో వెంకటేశాయా.. అద్బుతహాః

Update: 2016-07-02 15:27 GMT
ఒకప్పుడు జనాలు చూడటం కోసం చాలా డివోషనల్‌ సినిమాలు వచ్చేవి. రామాయణ, మహాబారత ఘట్టాలే కాదు.. అనేకానేక మైథలాజికల్‌ కథలు వెండితెరమీదకు తెరకెక్కించారు బి.ఎన్. రెడ్డి వంటి దిగ్గజాలు. కాలం మారింది. రోజులు మారాయి. ఇప్పుడంతా చంటిగాడు లోకల్, సమంత సూపరు హాటు వంటి సినిమాలే కాని.. ఇలాంటి భక్తితోరణాలు మాత్రం బయటకు రావట్లేదు.

అందుకే తన వంతుగా కంకణం కట్టుకొని మాంచి భక్తిరస చిత్రాలను బయటకు తెస్తున్నాడు నాగార్జున. ఒకప్పుడు అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డి సాయి బాబా సినిమాలను చేసిన ఆయన.. ఇప్పుడు శ్రీ వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు హాథీరామ్‌ బాబా జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అదే ''ఓం నమో వేంకటేశాయా'' సినిమా. ఈరోజు నుండే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమా చిత్రీకరణ మొదలెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ లో షూటింగ్ మొదలైంది. ఆ విషయంగా స్వయంగా నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

ఆయన షేర్‌ చేసిన ఫోటో చూస్తుంటేనే ఎంతో ఆథ్యాత్మికంగా.. అద్భుతంగా అనిపిస్తోంది. మరోసారి తమ సినీమాయతో ప్రేక్షకలోకాన్ని కట్టిపారేస్తారని అశిద్దాం. ఆల్‌ ది బెస్ట్.
Tags:    

Similar News