మహానటి.. నాకు కుళ్లుగా ఉంది -నాగార్జున

Update: 2018-05-01 17:54 GMT
మహానటి మూవీ ఆడియో లాంఛ్ హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నాగార్జున.. ఎన్టీఆర్ చీఫ్ గెస్టులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహానటి చిత్రం అంటే ఏఎన్నార్ కూడా తప్పనిసరిగా ఉంటారు. పైగా ఆ పాత్రను నాగచైతన్య చేశాడు. మూవీలో సమంత కీలక రోల్. ఇలాటి సమయంలో నాగ్ ఈ ఈవెంట్ కు అటెండ్ కావడంలో ఆశ్చర్యం లేదు.

'ఇవాళ ఇక్కడ సావిత్రి గారి అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఉన్నారు. నాన్నగారు ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. సావిత్రి.. వీరు లేనిదే ఎన్నో సినిమాలు లేవు. నన్ను 8 నెలల వయసులో ఎత్తుకుని వెలుగు నీడలు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు సావిత్రి గారు. నిజానికి ఓ వ్యక్తిపై బయోపిక్ తీయాలంటే అందుకు అర్హత ఉండాలి.. స్టార్ అయినా సరే ఆ అర్హత వారికి ఉండాలి.. ఒక తెలుగు సూపర్ స్టార్.. ఒక మహిళపై ఫస్ట్ బయోపిక్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రూపొందింది. ఓ మహిళపై ఇంతటి చిత్రం చేయడం తెలుగు సినిమాకు గర్వకారణం' అన్నారు నాగార్జున.

"నిజానికి సావిత్రి ఎవరో స్వప్నకు.. ప్రియాంకకు తెలీదు.. నాగ్ అశ్విన్ కు తెలీదు.. విజయ్ దేవరకొండకు తెలీదు.. దుల్కర్ కూడా తెలీదు. ఎక్కడి నుంచో వచ్చి మహానటిగా నటించే ఛాన్స్ కీర్తి సురేష్ కు వచ్చింది.. షి ఈజ్ లక్కి" అన్నారు నాగ్,

"మహానటిలో చేయలేకపోవడం నాకు జెలస్ గా ఉంది. తారక్ ఏం ఫీలవుతున్నాడో తెలీదు. అయినా చైతు నా తండ్రిగా ఎలా చేస్తాడు.. నాకు వయసు వచ్చేసింది లెండి.. చేసినా బాగోదు. సినిమాలో సమంత.. నా కోడలు పిల్ల కూడా ఉంది.సామ్.. చైతు.. మా ఫ్యామిలీ సావిత్రి గారితో కనెక్షన్ ఉంది. అప్పట్లో సావిత్రి గారు కనిపించగానే సిగ్గుపడి అమ్మ చాటుకి వెళ్లిపోయే వాడిని. దత్తుగారు మీరు ఎన్నో సినిమాలు ఇచ్చారు.. హిట్స్ ఇఛ్చారు.. మీకు హిట్ తో పాటు రెస్పెక్ట్ కూడా ఇచ్చే సినిమా మహానటి" అంటూ తన స్పీచ్ ముగించారు అక్కినేని నాగార్జున.
Tags:    

Similar News