కింగ్ అక్కినేని నాగార్జున తన రేంజ్ సక్సెస్ అందుకుని ఏళ్ళు గడిచింది. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత అంతటివిజయాన్ని కమర్షియల్ ప్రాఫిట్స్ ని ఏ సినిమా ఇవ్వలేకపోయాయి. మధ్యలో ఊపిరి-రాజు గారి గది 2 జస్ట్ ఓకే అనిపించుకున్నా అభిమానులు గర్వపడే స్థాయిలో అవి నిలవలేకపోయాయి. అందుకే మన్మథుడు 2 ఆ కొరత పూర్తిగా తీరుస్తుందని నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇది కొరియన్ రీమేక్ అని నాగ్ స్వయంగా చెప్పేశాడు కానీ కథ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు.
ఒక్క సినిమా అనుభవం ఉన్న రాహుల్ రవీంద్రన్ దీన్ని ఎలా హ్యాండిల్ చేసుంటాడా అనే అనుమానాలు లేకపోలేదు. ట్రైలర్ బాగానే ఉంది కానీ మరీ ప్రత్యేకంగా చెప్పుకునేంతగా ఏమి లేదనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. ఇదిలా ఉండగా రెండు సెంటిమెంట్స్ ఈ సినిమాకు కలిసి వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందులో ఒకటి రీమేక్ ఫ్యాక్టర్
నాగ్ చేసిన రీమేకుల్లో అధిక శాతం సక్సెస్ అయినవే. నువ్వు వస్తావని - నిన్నే ప్రేమిస్తా - సిసింద్రీ - నిర్ణయం - ఊపిరి - చంద్రలేఖ లాంటి వాటిలో ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. ఒకటో రెండో పోయాయి కానీ మిగిలినవన్నీ సూపర్ హిట్స్. ఇక రెండో కారణం సమంతా క్యామియో చేయడం. అసలే సామ్ సుడి మాములుగా లేదు. హిట్ల మీద హిట్లు కొడుతోంది.
ఓ బేబీలో సర్వం తానై యుఎస్ లో మిలియన్ డాలర్స్ వసూలు సినిమా ఖాతాలో వేసుకుంది. మజిలీ సక్సెస్ లోనూ మేజర్ క్రెడిట్ తీసుకుంది. మన్మథుడు 2లో హీరోయిన్ కాకపోయినా కీలకమైన గెస్ట్ రోల్ అన్నారు కాబట్టి ఇది కూడా సెంటిమెంట్ లాగా వర్క్ అవుట్ అవుతుందేమో. మొత్తానికి కంటెంట్ కంటే నాగ్ గ్లామరే కీ సెల్లింగ్ పాయింట్ గా మారిన మన్మథుడు 2 హిట్ కావడం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు సైతం చాలా అవసరం.