కాళ్లు మొద్దుబారిపోయాయ్ తెలుసా -నాగ్

Update: 2016-02-22 07:30 GMT
అక్కినేని నాగార్జున ఇప్పుడు 'ఊపిరి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమాల్లో పాత్రలతో చాలానే ప్రయోగాలు చేసిన నాగ్.. ఊపిరిలోనూ ఓ ఛాలెంజింగ్ రోల్ చేశారు. కాసేపు ఉండే ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే.. మిగతా రన్నింగ్ సినిమా అంతా నాగ్ కుర్చీకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. రెండు చేతులు, రెండుకాళ్లు చచ్చుబడిపోయిన ఓ బిలియనీర్ రోల్ ని నాగ్ పోషించారు.

కదలకుండా కూచుంటే సరిపోతుందిగా అనుకోవచ్చు కానీ.. అది చాలా కష్టమైన విషయం అంటున్నారు నాగార్జున. సీన్ చేసేటపుడు తన కాలు, చెయ్యి ఏదైనా కదులుతుందేమో అని పరిశీలించడానికే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని కూడా పెట్టారట. ఏ కొంచెం కదలిక ఉన్నా.. సీన్ మొత్తం మళ్లీ  రీషూట్ చేసేవారని చెప్పాడు కింగ్ నాగ్. ఇలా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు రీ షూట్ చేశామని.. ఇన్నేసి సార్లు కదలకుండా కూచోవాల్సి రావడం, సినిమా అంతా ఇదే రోల్ కావడంతో.. చాలాసార్లు కాళ్లు మొద్దుబారిపోయాయని అన్నారు నాగార్జున.

ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్స్ కి రీమేక్ గా తెరకెక్కిన ఊపిరిని.. మార్చ్ 25న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ పీవీపీ సిద్ధమవుతోంది. నాగ్ తో పాటు ఈ చిత్రంలో కార్తీ, తమన్నాలు నటించగా.. అనుష్క ఓ గెస్ట్ రోల్ లో చేస్తోంది. ఒరిజినల్ మాదిరిగా కాకుండా.. ఊపిరిలో కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. తెలుగు, తమిళ్ లో ఒకేరోజు విడుదల కానుండగా... తమిళ్ వెర్షన్ తోఝాకు నాగ్ స్వయంగా డబ్బింగ్ చెప్తున్నారు
Tags:    

Similar News