‘ఎ నాగార్జున ఎంకరేజ్ మెంట్’..కొత్త మాట

Update: 2016-01-24 17:30 GMT
బేనర్ ముందు వరసిద్ధి వినాయకస్వామి ఆశీస్సులతో.. వేంకటేశ్వరుణి కరుణతో అని వేసుకోవడం చూశాం ఇన్నాళ్లూ. నిర్మాణ భాగస్వామిగా ఎవరైనా పెద్ద నిర్మాత ఉంటే.. ఆ నిర్మాత పేరుతో ‘సమర్పించు’కోవడమూ చూశాం. ఐతే ఓ హీరో కమ్ ప్రొడ్యూసర్ పేరు వేసి.. ఆయన ప్రోత్సాహంతో అని పోస్టర్లలో, ప్రోమోస్ లో వేయడం మాత్రం ఇంతవరకు చూడలేదు. ‘పడేసావే’ సినిమా విషయంలో మాత్రం ఈ చిత్రం చోటు చేసుకుంది. ‘యాన్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్’ అంటూ నాగార్జున బొమ్మ, ఆయనకు కింగ్ కిరీటం పెట్టి మరీ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో నాగార్జున హ్యాండ్ ఏంటి అని ఆశ్చర్యం కలగడం సహజం.

‘పడేసావే’ డైరెక్టర్ చునియా అక్కినేని వారి ‘అన్నపూర్ణ స్టూడియోస్’లో పని చేసింది. అంతకుముందు రాఘవేంద్రరావు, రాజమౌళిల దగ్గరా శిష్యరికం చేసింది. ఈ అభిమానంతోనే నాగార్జున, రాఘవేంద్రరావు ఇద్దరూ కలిసి ఈ సినిమా ప్రమోషనల్ టీజర్ని రిలీజ్ చేశారు. ‘మనం’ సినిమా టైంలో తనకు చునియా ఈ కథ చెప్పిందని.. వినగానే వెంటనే నచ్చేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నానని నాగ్ చెప్పాడు. ఒకటిన్నర నిమిషం టీజర్ మొత్తానికి నాగార్జునే వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ప్రేమలో మూడు కోణాలుంటాయని.. అది బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదని.. ఈ ట్రయాంగిల్లోకి ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వస్తే చాలా డేంజర్ అని.. ఓ కాన్సెప్ట్ ఏదో చెప్పాడు నాగ్. అది ఆసక్తికరంగానే ఉంది.

ఇంతకుముందు ‘టిప్పు’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తీక్ రాజు ఇందులో హీరో. ఇద్దరు కొత్తమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రమోషనల్ సాంగ్ సినిమా మీద బాగానే ఆసక్తి రేకెత్తించింది. దీంతో పాటు ఆలీ మీద ఓ పాట కూడా రిలీజ్ చేశారు. అది కూడా సరదాగా బాగానే ఉంది. మరి ఈ సినిమాతో జనాల్ని చునియా ఎలా ‘పడేస్తుందో’ చూడాలి మరి.
Tags:    

Similar News