అక్కినేని నాగార్జున కెరీర్లో చాలా క్లాసిక్ ఫిలిమ్స్ ఉన్నాయి.. ఎన్నున్నా అందులో 'మన్మథుడు' సినిమాను మాత్రం తప్పని సరిగా చెప్పుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ కథ - మాటలు అందించాడు. లవ్ - ఎమోషన్స్ - కామెడీ - మ్యూజిక్ ఇలా అన్నీ పర్ ఫెక్ట్ గా కుదరడంతో సూపర్ హిట్ అయింది. అప్పుడే కాదు ఇప్పుడు కుడా టీవీలో వస్తే అలా చూస్తూ ఉండి పోతారు.
ఇంతకీ పదహారేళ్ళ క్రితం తెరకెక్కిన ఈ మన్మథుడి గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దానికో కారణం ఉంది. ఈమధ్యే నాగార్జున 'మన్మథుడు-2' టైటిల్ ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ తన బ్యానర్ పై చేయించాడట. మరి ఈ సీక్వెల్ లో ఎవరు నటిస్తారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నాగార్జున ప్రస్తుతం 'దేవదాస్' సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ 'బంగార్రాజు' వర్క్ జరుగుతుందని తన నెక్స్ట్ సినిమా అదేనని రీసెంట్ గా చెప్పాడు. ఇది కాకుండా ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తానని చెప్పాడు. కాబట్టి నాగ్ ప్రస్తుతానికి బిజీనే. దీంతో చైతు - అఖిల్ ఇద్దరిలో ఒకరి కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేసి ఉంటాడని ఊహాగానాలు సాగుతున్నాయి.
గతంలో సీక్వెల్స్ - సెకండ్ పార్ట్ పేరు చెప్తే తెలుగులో భయపడేవారు. అదో నెగెటివ్ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ 'బాహుబలి-2' తో అలాంటి నెగెటివ్ సెంటిమెంట్లు అన్ని తుడిచిపెట్టుకుపోయాయి. కనుక మీరు కూడా అక్కినేని వారి రెండో మన్మథుడు సినిమాకు రెడీ గా ఉండండి.