క‌ల‌ర్ వెర్ష‌న్ 3 రోజులు ఆడితే హిట్టే

Update: 2015-09-11 11:30 GMT
రామ్‌ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ల్ట్ సినిమా శివ 90ల‌లో సెన్సేష‌న‌ల్ హిట్‌. తెలుగు సినిమాకి కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. అక్కినేని నాగార్జున‌, అమ‌ల జంట‌గా న‌టించారు. ఇళ‌య‌రాజా సంగీతం బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. రీ-రికార్డింగ్‌ లో కొత్త ట్రెండ్ తెచ్చిన సినిమా ఇది. శ‌బ్ధాన్ని ఎక్క‌డ ఎంత ఎలా వాడాలో నేర్పే ఓ బైబిల్‌. పాతికేళ్ల‌లో బుల్లితెర‌పై ఈ సినిమాకి ఏనాడూ టీఆర్‌ పీ ప‌డిపోయింది లేదు. అంత‌టి గొప్ప సినిమా గనుకే ఈ చిత్రాన్ని మ‌ళ్లీ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు నాగార్జున‌.

ఇప్ప‌టికే డిజిటల్‌ లో 4కె రిజోల్యుషన్‌ కు రీస్టోర్‌ చేసిన శివ రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని స‌రైన టైమ్ చూసి వ‌ద‌లాల‌ని కింగ్ ఆలోచిస్తున్నారుట‌. అప్ప‌ట్లో క‌ల‌రైజ్ చేసిన‌ మాయా బ‌జార్ రిలీజై సంచ‌ల‌నం సృష్టించింది. అదే తీరుగా శివ సినిమాని  రీరిలీజ్ చేసి హిట్ కొట్టాల‌న్న‌ది నాగ్ ప్లాన్‌. అయితే సినిమాకి స‌రైన రిలీజ్ తేదీ చాలా ముఖ్యం. ఎప్పుడు రిలీజ్ చేస్తే మైలేజ్ పెరుగుతుందో అప్పుడే రిలీజ్ చేయ‌డం కింగ్ అల‌వాటు. ఓ వీకెండ్ ఆడినా చాలు. మూడు రోజుల్లోనే కొత్త వర్షెన్‌ పోస్టు ప్రొడక్షన్‌ సొమ్ముల్ని రాబ‌ట్టేయ‌వ‌చ్చు. కేవ‌లం అభిమానుల్ని శివ మెప్పిస్తే చాలు. అందుకే ఇప్పుడు శివ రిలీజ్‌ కి టైమ్ ద‌గ్గ‌రికొచ్చింది.

సో్గ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని డిసెంబ‌ర్‌ లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు కాబ‌ట్టి .. దానికి కాస్త ద‌గ్గ‌ర‌లోనే ఈ సినిమాని కూడా రిల‌జ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. అయితే నాగ చైతన్య నటించిన సాహసం స్వాసగా సాగిపో కు రిలీజయ్యాక.. అప్పుడు శివ రిలీజ్‌ చేసి.. దాని తరువాత సోగ్గాడే రిలీజ్‌ చేస్తారట. అది సంగతి .
Tags:    

Similar News