సంక్రాంతి పుంజుగా బంగార్రాజు!

Update: 2019-01-18 13:23 GMT
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయనా' నాలుగేళ్ళ క్రితం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ సిననిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.  అందుకే బంగార్రాజు పాత్రను కొనసాగించి 'బంగార్రాజు' టైటిల్ తో ఒక సీక్వెల్ చేస్తామని అప్పట్లోనే నాగార్జున ప్రకటించారు. కానీ సీక్వెల్ కోసం కళ్యాణ్ కృష్ణ తయారు చేసిన స్క్రిప్ట్ నాగ్ ను పెద్దగా మెప్పించకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కనపెట్టారు.
 
తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.  కళ్యాణ్ కృష్ణ అప్పట్లో తయారు చేసిన స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి నాగార్జున - నాగ చైతన్యలు కలిసి నటించేలా తీర్చిదిద్దాదట.  ఈ సినిమాలో బంగార్రాజు మనవడిగా చైతు నటిస్తాడట  స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని.. నాగ చైతన్య ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేయగానే సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నాలలో ఉన్నారట.  చైతు ప్రస్తుతం 'మజిలీ' లో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తికాగానే మేనమామ వెంకటేష్ తో కలిసి 'వెంకీ మామ' చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపే 'బంగార్రాజు' ను పట్టాలెక్కిస్తారట.

ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తారని.. వచ్చే సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  బంగార్రాజు.. అయన ముద్దుల మనవడు చేసే చిలిపిపనులు ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం సంవత్సరం పాటు వేచి చూడాలి!
Tags:    

Similar News