ప్రేమమ్ కూడా శివలాంటి సినిమాయే

Update: 2016-10-19 12:39 GMT
కింగ్ నాగార్జున ఇప్పుడు ''ప్రేమమ్'' సినిమా సక్సెస్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన.. సినిమా ఏ రేంజులో తనకు కిక్ ఇచ్చిందో చెప్పారు. ''మా నాన్న ఒక మాట అనేవారు. నన్ను.. కొడుకు కదా పొగడకూడదు అనేవారు. కాని నేను అలా అనుకోను. పొగుడుతాను. చైతన్య సినిమాలో ఇరగదీశాడు. మూడు వేరిషయన్లు అద్భుతంగా పండించాడు. చెయ్ వెల్ డన్ రా!!'' అంటూ మొత్తం మీటింగులో కిక్ ఇచ్చారు నాగ్.

ఇకపోతే ఆద్యంతం సినిమా దర్శకుడు చందూ మొండేటిని పొగిడేశారు ఆయన. ''చందూకి కంగ్రాట్స్ చెప్పాలి. ప్రేమమ్ మలయాళంలో ఒక కల్ట్ క్లాసిక్. కాని అలాగే ఇక్కడ తీస్తే సినిమా ఆడదు.  మన కామెడీ - కల్చర్ - సెన్సిబిలిటీ - సాంగ్స్ అన్నీ వేరు. దానిని చక్కగా ఎడాప్ట్ చేసుకుని ఈ సినిమాను బాగా తీశాడు చందు. ఫెంటాస్టిక్ జాబ్. ఫస్ట్ సినిమా రాగానే విపరీతంగా ట్రాల్ చేశారు. కంప్లీట్ గా కేరళ అండ్ తమిళనాడు ఫ్యాన్సు ఏకేశారు. కాని సినిమా రిలీజయ్యాక చూశారుగా. సినిమాలో డైలాగులు చూస్తుంటే.. నువ్వు నాకు పెద్ద ఫ్యాన్ అని అనిపించింది చందూ. నాతో సినిమా చెయ్యి త్వరగా'' అన్నారు నాగ్.

ఇక చైతన్య గురించి మాట్లాడుతూ.. ''నేను ఒకప్పుడు కంప్లీట్ గా ఓపెన్ అయిపోయి నాకు నచ్చింది చేశాను. అదే గీతాంజలి సినిమా. ఇప్పుడు ప్రేమమ్ పరిస్థితి కూడా అంతే. చై ఇరగదీశాడు. ధియేటర్లలో నుండి సినిమా వెళ్ళిపోయినా కూడా టివిల్లో ఎన్నిసార్లు వేసినా కూడా ఈ సినిమాను జనాలు చూస్తూనే ఉంటారు. అలాగే కొడుకు గెలుపే తండ్రికి సంతోషం. ఇప్పుడు ఆ సంతోషంలోనే ఉన్నాను'' అని చెప్పారు నాగ్.

అయితే సినిమా రీషూట్ల గురించి కూడా చెప్పాడు నాగ్. ''నిర్మాత రాధాకృష్ణ.. కొన్ని సీన్లు నచ్చలేదండీ.. వాటి కోసం రీ-షూట్లు చేస్తున్నామండీ అన్నారు. తప్పకుండా చెయ్యండి.. డేట్ పోయినా పర్లేదు కాని.. బాగా ఔట్ పుట్ వచ్చాకే రిలీజ్ చేయండి అన్నాను. ఆయన కూడా అదే చేశారు. ఇంత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ చైతూకి దొరికినందుకు ఆనందంగా ఉంది. ఫ్యూచర్ లో చైతూతో ఇంకా సినిమాలు తీస్తారని అనుకుంటున్నాను'' అంటూ ముగించారు అక్కినేని యువసామ్రాట్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News