కుర్ర హీరో ధైర్యానికి నాగ్ ప్రశంసలు

Update: 2017-01-13 15:52 GMT
యంగ్ హీరో శర్వానంద్.. సంక్రాంతి రేస్ లో ఉన్నానని ముందే చెప్పాడు. చెప్పినట్లే.. పండుగ రోజు వచ్చేస్తున్నాడు కూడా. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలతో పాటు రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడంతోనే.. డేరింగ్ చూపించినట్లయింది.

ఇప్పుడు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సమయంలో శనివారం నాడు థియేటర్లలోకి వస్తోంది శతమానం భవతి. ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్స్ వేయడంతో మూవీ బాగుందనే టాక్ ఉంది. ఇప్పుడీ సినిమాకి నాగ్ సపోర్ట్ కూడా లభించింది. అంతే కాదు.. శర్వానంద్ ధైర్యాన్ని పొగిడారు నాగార్జున. 'శర్వానంద్. ధైర్యం-విజయం ఎప్పుడూ కలిసే ఉంటాయ్. నీ సినిమాని పెద్ద మూవీస్ తో పాటు రిలీజ్ చేస్తున్న ధైర్యం నీకుంది. గతేడాది కూడా ఇలాగే సక్సెస్ సాధించావు. ఈ ఏడాది కూడా నీకు విజయం లభించాలని కోరుకుంటున్నా' అన్నారు నాగ్.

శర్వానంద్ కి జోడీగా.. అనుపమా పరమేశ్వరన్ నటించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కావడంతో.. ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి పాజిటివ్ టాక్ ఎక్కువ కాగా.. తాజా స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాక ఇది పీక్స్ కి చేరిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News