టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 స్టేజ్ మీద గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రమోట్ చేశారు. ఆది వారం ఎపిసోడ్ లో ఎంపీ సంతోష్ సందడి చేశారు. ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను గురించి వివరించారు. ఆ సందర్బంగా నాగార్జున స్పందిస్తూ తాను అడవిని దత్తత తీసుకోవచ్చా అంటూ అడిగాడు.
ఆ సమయంలో తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుంటాను అంటూ ప్రకటించాడు. ఆ నిర్ణయంతో అంతా కూడా నాగర్జునను అభినందిస్తున్నారు. ఈ సమయంలో అడవుల పెంపకం చాలా అవసరం. గ్లోబల్ వార్మింగ్ తో పాటు ఎన్నో రకాల నష్టాలు కష్టాలు ఉన్న నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం మంచిదంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెండు మూడు చెట్లు పెట్టడమే చాలా మంచి పని.. అలాంటిది నాగార్జున వెయ్యి ఎకరాల్లో అడవిని దత్తత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే అడవిని దత్తత తీసుకున్న విషయం తెల్సిందే.
ఎంపీ సంతోష్ ఆధ్వర్యంలో ప్రభాస్ అడవిని దత్తత తీసుకుని ఇప్పటికే ఆ అడవికి కావాల్సిన నిధులను కూడా ఇవ్వడం జరిగిందట. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి నాగార్జున కూడా అడవిని దత్తత తీసుకోవడం మంచి పరిణామం. ముందు ముందు మరింత మంది తెలుగు హీరోలు సెలబ్రెటీలు కూడా ఇలా అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ను వచ్చే వారంతో ముగించబోతున్నాడు. ఒక వైపు బిగ్ బాస్ చేస్తూనే మరో వైపు నాగార్జున బంగార్రాజు సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. మరో వైపు ఘోస్ట్ సినిమా లో కూడా నాగార్జున నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమా లు కూడా బ్యాక్ టు బ్యాక్ కొద్ది తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
భారీ అంచనాలున్న కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నాగ చైతన్య మరియు నాగార్జునలు ఇద్దరు కూడా బంగార్రాజులుగానే కనిపించబోతున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతుంది.