ఫోటోస్టొరీ: దేవా - ది అక్కినేని డాన్

Update: 2018-08-28 11:58 GMT
అక్కినేని నాగార్జున నాని తో కలిసి 'దేవదాస్' అనే మల్టిస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఒక కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవా అనే డాన్ పాత్రలో నాగ్ నటిస్తున్నాడు.  నాగ్ డాన్ గా నటించడం ఇదేమీ మొదటిసారి కాదు గానీ ఈరోజు రిలీజ్ చేసిన స్టిల్ మాత్రం అదిరిపోయింది.

లోపలేమో గ్రే కలర్ సూట్ పైనేమో ఒక బ్లూ కలర్ లాంగ్ కోట్ లో ఒక హాలీవుడ్ హీరో స్టైల్ లో నాగ్ కనిపించాడు. డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా గ్రే కలర్ హ్యాట్ - కళ్ళజోడు పెట్టుకొని ఒక స్తంభానికి అలా అనుకొని స్టైల్ గా నిలబడ్డాడు.  అసలే టాలీవుడ్ మన్మథుడు పైగా స్టైలిష్ డాన్ గెటప్.. ఇది అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్.  ఎవరి పుట్టినరోజు అని డౌట్ వచ్చిందా లేదా? రేపే నాగార్జున పుట్టిన రోజు.  ఆ సందర్భంగానే ఈ స్టైలిష్ స్టిల్ రిలీజ్ చేసింది 'దేవదాస్' టీమ్. ఇప్పటికే పోస్టర్స్ - టీజర్ తో అంచనాలు పెంచిన 'దేవదాస్' టీమ్ మరోసారి కొత్త పోస్టర్ తో ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలో నాగార్జున - నాని తో పాటు రష్మిక మందన్న - ఆకాంక్ష సింగ్ లు నటిస్తున్నారు.  మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీరాం ఆదిత్య దర్శకుడు.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News