కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా ఎప్పుడు మొదలువుతుందో ఇన్ఫర్మేషన్ లేక అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ఏడాది దేవదాస్ తర్వాత నాగ్ మళ్ళి స్క్రీన్ మీద కనిపించలేదు. ఇప్పుడు మన్మథుడు 2తో పాటు సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజును ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అసలే టాలీవుడ్ లో సీక్వెల్స్ కి టైం బాగాలేదు. ఇలాంటి ట్రెండ్ లో ఒకేసారి రెండు అంటే ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంటుంది.
మన్మధుడు వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దానికి కొనసాగింపు అంటేనే ప్రేక్షకుల్లో సందేహాలు ఉన్నాయి. పోనీ దాన్ని నిలబెట్టిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు విజయ్ భాస్కర్ దీనికి వర్క్ చేస్తున్నారా అంటే అదీ లేదు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రాహుల్ రవీంద్రన్ కి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం
ఇక కళ్యాణ్ కృష్ణ మీద ఎగతెగని నమ్మకంతో బంగార్రాజుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ ఆ మేజిక్ ని రిపీట్ చేయగలిగితేనే ఇది వర్క్ అవుట్ అవుతుంది. పైగా కళ్యాణ్ కృష్ణ గత ఏడాది నేల టికెట్టుతో తన క్రియేటివిటీ మీద అనుమానం వచ్చేలా చేసుకున్నాడు. ఏదో ఫ్రెష్ సబ్జెక్టు అయితే ఓకే కానీ సోగ్గాడే చిన్ని నాయనను ఏదో బాహుబలి కెజిఎఫ్ లాగా ఇంత గ్యాప్ తో కొనసాగింపు అంటే రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది.
అభిమానుల సంగతి పక్కన పెడితే మన్మధుడు సోగ్గాడే చిన్ని నాయనలకు సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ చూడాలన్నంత ఎగ్జైట్ మెంట్ సాధారణ ప్రేక్షకుల్లో ఉందా అంటే వెంటనే చెప్పలేం. పోనీ ఒకదాని తర్వాత ఒకటి ఓకే కానీ ఇలా తక్కువ గ్యాప్ లో రెండు వరసగా సెట్స్ పైకి తీసుకెళ్లడం అంటే చూడాలి నాగ్ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో