అక్కినేని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు నాగార్జున 'బంగార్రాజు' కోసం దాదాపుగా నాలుగు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనో సినిమా లోని బంగార్రాజు పాత్రలో నాగార్జున ను చూసిన అభిమానులు ఆ పాత్ర తో మొత్తం సినిమా ఉంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. బంగార్రాజు సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. కాని నాలుగు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అన్నట్లుగానే ఆ ప్రాజెక్ట్ ను పక్కకు పెడుతూ వస్తున్నారు. ఇటీవల బంగార్రాజు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందనే వార్తలు మీడియాలో వచ్చాయి. బంగార్రాజును సైలెంట్ గా మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్ వినిపించింది. కాని తాజాగా వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ అక్కినేని అభిమానులను మరోసారి నిరాశ పర్చాడు.
వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా సాగుతోంది. గత ఏడాదిలోనే సినిమా ను మొదలు పెట్టాలనుకున్నా ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎంత కాలం బంగార్రాజు స్క్రిప్ట్ ను రెడీ చేస్తారంటూ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. నాగార్జున బంగార్రాజు సినిమా గురించి వచ్చినన్ని వార్తలు ఆయన కెరీర్ మొత్తంలో మరే సినిమాకు వచ్చి ఉండవు. అయినా ఇప్పటికి కూడా ఆ సినిమా పట్టాలెక్క పోవడం విడ్డూరంగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు అయినా బంగార్రాజు పట్టాలెక్కేనా అనేది చూడాలి.