'మన్మథుడు 2' టీజర్ విడుదల కాగానే అందరినీ ఆకర్షించిన అంశం.. అందులో ఉన్న బోల్డ్ నెస్. అరవైల దగ్గర వయసులో ఉన్న నాగార్జున లాంటి సీనియర్ స్టార్ నుంచి ఇలాంటి బోల్డ్ టచ్ ఉండే ఫిలిం టీజర్ కొందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. వయసుమళ్ళిన వర్జిన్ లా.. పెళ్ళి అంటే ఆమడ దూరం పారిపోయేలా ఉన నాగ్ పాత్ర కొందరికి నచ్చినా కొందరుమాత్రం ఈ వయసులో ఈ 'వర్జిన్' వ్యవహారం నాగార్జునకు అసలు సెట్ కాలేదని విమర్శించారు.
అయితే ఈ విషయంపై నాగార్జున 'మన్మథుడు 2' ప్రమోషన్స్ లో తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ఆ విషయంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా నాగ్ ను సమర్థించారు. వర్జినిటీ అంశం.. వయసులో చాలా చిన్నదైన రకుల్ తో ప్రేమాయణం లాంటివాటిని ఎంతో సున్నితంగా డీల్ చేయడం జరిగిందని.. అందులో నుంచే సందర్భానికి తగ్గట్టు కామెడీ వచ్చిందని తెలిపారు. ఒకవైపు నాగ్ పాత్రేమో.. 'మేక్ లవ్వు' అంటుంటే రకుల్ 'గుప్పు గుప్పున ఊదు పఫ్ఫు' అంటూ రెచ్చిపోయింది.. ఇదంతా పాత్ర స్వభావాలను బట్టే చూపించడం జరిగిందట.
అక్కినేనివారు ఏం చెప్పినా అందంగానే ఉంటుంది. ఈ లాజిక్ కూడా బాగానే ఉంది.. అయితే ప్రేక్షకులు కూడా దాన్ని సున్నితంగా తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఆగష్టు 9 వ తారీఖున మాత్రమే తెలుస్తుంది. ఏదేమైనా ఈ బోల్డ్ కంటెంట్ సినిమాకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చిందనేది మాత్రం వాస్తవం.