కెరీర్ తొలి నుంచి ప్రయోగాలతో కొత్త ట్రెండ్ సెట్ చేయడం నాగార్జునకు అలవాటు. శివ లాంటి కల్ట్ సినిమాలో నటించినా.. ఆ సినిమాతో ఆర్జీవీని పరిచయం చేసినా ఆ ఘనత నాగార్జునకే దక్కింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డెసిషన్స్ తోనే ఆయన సక్సెస్ ముడిపడి ఉంది. ఆయన కెరీర్ లో ఏకంగా 40మంది కొత్త దర్శకుల్ని పరిచయం చేశారంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ దర్శకుడు అషిషోర్ సోలమన్ 40వ వాడు.
నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను వైల్డ్ డాగ్ బేస్ క్యాంప్ ఈవెంట్ గా జరుపుకుంది టీమ్. ఈ సందర్భంగా తమ హీరో నాగార్జున గురించి నిర్మాత నిరంజన్ రెడ్డి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. కెరీర్ లో సుమారు 100 చిత్రాలలో నాగార్జున పరిచయం చేసిన నలభైవ కొత్త దర్శకుడు ఆషిషోర్ సోలమన్. 40శాతం చిత్రాలలో యువ ప్రతిభకు అవకాశం ఇవ్వడం అనేది ఏదైనా పరిశ్రమలో ఎవరూ విననిది. కొత్తవారితో ప్రయోగాలు చాలాసార్లు నిరాశపరిచినా కానీ ఆయన సాహసాలు చేశారు. నవతరానికి కేరాఫ్ గా నిలిచారు నాగార్జున`` అని అన్నారు.
నాగార్జున తన పాత్ర గురించి చెబుతూ.. ఎసిపి విజయ్ వర్మ పాత్ర నన్ను ఆకట్టుకుంది. అతను మంచి మనిషి.. మంచి భర్త.. మంచి తండ్రి .. మంచి టీమ్ లీడర్.. అతను తన దేశం కోసం ఏం చేయడానికైనా వెనకాడడు.. అని తెలిపారు.
నిజ జీవితంలో కూడా విజయ్ వర్మలా నిర్భయంగా ఉండడం నాకు ఇష్టం. నేను ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడతాను. ప్రతి చిత్రంలో నన్ను భిన్నంగా చూపించే కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ నా జీవితమంతా ప్రయోగాలు చేస్తున్నాను అని అన్నారు. ప్రస్తుతానికి ప్రచారం బావుంది. వైల్డ్ డాగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి తిరిగి నూతనోత్సహంతో దూసుకెళ్లాలన్న కింగ్ ప్లాన్ సక్సెసవుతుందనే భావిద్దాం.