అక్కినేని అంటేనే ఒక బ్రాండ్

Update: 2017-09-09 08:39 GMT
కొందరి స్టార్స్ సినిమాల ప్రభావం ఎలా ఉన్నా జనాల్లో మాత్రం మంచి ఆదరణను రాబట్టుకుంటారు. దీంతో బడా కంపెనీలు వారి గ్లామర్ ను పబ్లిసిటీని గమనించి బ్రాండ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంటాయి. ప్రస్తుత రోజుల్లో తెలుగు తారలు నేషనల్ లెవెల్ మర్కెట్స్ ని సైతం ఆకర్షిస్తూ.. ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కినేని కుటుంబం మొత్తం యాడ్స్ లలో నటిస్తూ మంచి స్టార్ డమ్ ఉన్న యాక్టర్స్ గా పేరు సంపాదించుకుంటున్నారు.

ప్రస్తుతం అక్కినేని అఖిల్ కాబోయే వదిన సమంతతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారితో నాగార్జున కూడా కలవబోతున్నారు. సెప్టెంబర్ 9 మియా పూర్ లోని మదీనాగుడాలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు 14వ బ్రాంచ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవంలో నాగార్జున చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. అలాగే ప్రగ్యా జైస్వాల్ - రాశి ఖన్నా కూడా వేడుకలో మెరవనున్నారట.

నాగార్జున ఇప్పటికే కళ్యాణ్ జ్యూవెలర్స్ కి ప్రచార కర్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి సపోర్ట్ చేయబోతున్నట్లు నాగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఇక మరో వైపు నాగ చైతన్య కూడా చెన్నై షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.ఫైనల్ గా అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఏ స్టార్ హీరోలకు అందని విధంగా యాడ్స్ లలో దుమ్ము రేపుతున్నారు అనిపిస్తోంది.        
Tags:    

Similar News