నాగశౌర్య హీరోగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమా రూపొందింది. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నాగశౌర్య సొంత బ్యానర్లోనే నిర్మితమైంది. ఈ సినిమాతో న్యూజిలాండ్ భామ షెర్లీ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూపర్చిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈ స్టేజ్ పై నాగశౌర్య మాట్లాడుతూ .. "కోవిడ్ కారణంగా చాలామంది ఆర్ధికంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు .. అలాంటివారిలో మేము కూడా ఉన్నాము. సినిమా పట్ల ప్రేమతో కాదు .. నా పట్ల గల అనురాగంతో మా పేరెంట్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనే ఉద్దేశంతో వడ్డీలపై వడ్డీలు కడుతూ వచ్చారు. నిజంగా ఇలాంటి పేరెంట్స్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా అమ్మానాన్నలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
దర్శకుడు అనీష్ కృష్ణకి చాలా సహనం ఎక్కువ. ఆయనతో కలిసి రెండున్నరేళ్లు ప్రయాణం చేశాను. ఆయన నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. ఎంతటి టెన్షన్ ఎదురైనా చాలా కూల్ గా ఉండటం తన ప్రత్యేకత. ఇక మా కెమెరా మెన్ ఈ సినిమాలో నన్ను మరింత హ్యాండ్సమ్ గా చూపించారు.
ఈ సినిమాతో ఇండస్ట్రీకి షెర్లీ పరిచయమవుతోంది. తను చాలా అందంగా కనిపిస్తుంది .. మంచి ఆర్టిస్ట్ కూడా. పాటలు కూడా బాగా పాడుతుంది. ఆమెతో కలిసి నటించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో రాధికగారు ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆమె ఈ సినిమా చేయనంటే మాత్రం ఆపేద్దామని ముందుగానే నేను డైరెక్టర్ గారితో చెప్పాను.
ఈ సినిమా కోసం నేను పాదయాత్ర చేశాననే సంగతి తెలిసిందే. అప్పుడు ఒకతను నాతో అన్నాడు .. డబ్బులు ఉన్నవారే సినిమాలు తీస్తుంటారు .. చేస్తుంటారు అని. నిజం చెప్పాలంటే ఇక్కడున్న మేమంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవారమే. హీరో కావడానికి ముందు నాకు కార్లు లేవు .. ఇళ్లు లేవు.
పట్టుదలతో ఇక్కడికి వచ్చి మా కలను .. కసిని నిజం చేసుకున్నాము. అలాంటి కసి ఉన్నవారు ఎవరైనా ఇక్కడికి రావొచ్చు. నష్టం వచ్చినా .. లాభం వచ్చినా ఒక రైతు పొలంలోనే పనిచేస్తూ ఉంటాడు. అలా మేము కూడా సినిమాలే చేస్తుంటాము .. మాకు తెలిసింది ఇదే. మీరంతా ఈ సినిమా చూడండి .. నమ్మకంతో చెబుతున్నాను .. మిమ్మల్ని ఎంతమాత్రం నిరాశ పరచదు" అని చెప్పుకొచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.