అల్లు.. త్రివిక్ర‌మ్ మూవీపై క్లారిటీ ఇచ్చేసింది

Update: 2019-03-03 08:15 GMT
టాలీవుడ్ అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేసిన అతి కొద్ది అగ్ర న‌టీమ‌ణుల్లో న‌గ్మా ఒక‌రు. త‌న అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని పిచ్చెక్కించిన ఆమె.. అప్ప‌టి యూత్ కు నిద్ర లేకుండా చేసిన రికార్డు ఆమె సొంతం. అలాంటి ఆమె సినిమాల‌కు దూర‌మై కొంత‌కాలం ఉండిపోయారు.

రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అగ్ర స్థానంలో ఉన్నారు. రాహుల్ కోర్ టీంలో స‌భ్యురాలిగా ఆమెకు మంచి గుర్తింపే ఉంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సినిమాల వైపు చూడ‌ని ఆమె.. అల్లు.. త్రివిక్ర‌మ్ కాంబ‌నేష‌న్లో వ‌స్తున్న మూవీలో చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అదే జ‌రిగితే.. న‌గ్మా రీఎంట్రీ ఎలా ఉంటుంద‌న్న ఉత్సుక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిపై తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్.. త్రివిక్ర‌మ్ కాంబ‌నేష‌న్లో వ‌స్తున్న సినిమాలో చేయాల‌ని త‌న‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని.. అలాంటిది అలాంటి న్యూస్ ఎందుకు వ‌చ్చిందో త‌న‌కు అర్థం కావ‌టం లేదంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు.

బ‌న్నీ మూవీలో చేయ‌ట్లేద‌ని చెప్పిన న‌గ్మా.. త‌న వ‌ద్ద‌కు ఒక థ్రిల్ల‌ర్ మూవీ కోసం వ‌చ్చార‌ని.. ఆ క‌థ న‌చ్చింది కానీ అందులో తాను కొన్ని మార్పులు సూచించిన‌ట్లు చెప్పారు. దాని మీద వారు వ‌ర్క్ వుట్ చేస్తున్నార‌ని.. అది క‌నుక అనుకున్న‌ట్లుగా వ‌స్తే మాత్రం తాను ఆ సినిమా చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే.. ఆమెను అప్రోచ్ అయిన తెలుగు థ్రిల్ల‌ర్ ఎవ‌రిదన్న విష‌యంపై మాత్రం ఆమె ఎలాంటి వివ‌రాలు చెప్ప‌లేదు. న‌గ్మా రీఎంట్రీ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.


Tags:    

Similar News