వీపు చూపి వేడెక్కిస్తున్న వర్మ భామ!

Update: 2021-01-30 02:30 GMT
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చే హీరోయిన్స్ రొమాంటిక్, డేర్ అనే పదాలకు దగ్గరగా ఉంటారు. ఆయన హీరోయిన్స్ చేసే సినిమాలలో అందాల ఆరబోతకు మినిమం గ్యారంటీ. అయితే వర్మ సినీ పరిశ్రమకు ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేసాడు. అలా పరిచయమైన అందాల భామ నైనా గంగూలీ. 2016లో విడుదలైన వంగవీటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నైనా.

ఇక ఫస్ట్ సినిమాలో డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది నైనా. ఆ వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఆఫర్ రావడంతో 'మేరీ భేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై' సినిమా చేసి అక్కడ అడుగుపెట్టింది. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది నైనా. కానీ అన్నింట్లో రొమాన్స్, గ్లామర్ అనే అంశాలు లేకుండా చేయనని అంటుందట ఈ ముద్దుగుమ్మ. డేర్ అంటే నైనాదే అనేలా సారీ నుండి మోడరన్ డ్రెస్ లతో పాటు టు పీస్ బికినీ వరకు అన్నింట్లోను లోటులేకుండా గ్లామర్ గుప్పిస్తోంది.

అయితే నైనాకు ఈ జనరేషన్ కుర్రకారు అభిరుచులు బాగా తెలుసు. అందుకే కేవలం వయ్యారాల వలలు విసిరి మనసులు దోచుకుంటుంది. ఈ భామ 'చరిత్రహీన్' అనే రొమాంటిక్ వెబ్ సిరీస్ లలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలాగే ఇటీవల జోహార్ అనే తెలుగు సినిమాలో నటించింది. కానీ ప్రస్తుతం మళ్లీ వర్మ సినిమాలతో బిజీగా ఉంది. వర్మ దర్శకత్వంలో బ్యూటిఫుల్ అనే సినిమాలో నటిస్తోంది. రంగీలా మూవీకి ట్రిబ్యూట్ అంటూ రూపొందుతున్న ఈ సినిమాలో నైనా అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోంది.

 ఇప్పటికే విడుదలైన సాంగ్స్ లో ఘాటైన రొమాన్స్, ఘాటు పెదవి ముద్దలతో రెచ్చిపోయింది. అలాగే వర్మ డైరెక్షన్ లో ఓ లెస్బియన్ మూవీ కూడా చేస్తోంది. ఇందులో ఏకంగా అప్సరరాణితో కలిసి ఓ రేంజి రొమాన్స్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో నైనాకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇంస్టాలో తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసింది. స్టైలిష్ మినీ డ్రెస్ లో అద్దంలో తన అందాన్ని చూసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. టేబుల్ మీద కూర్చొని మొత్తం వయ్యారి వీపంతా కెమెరా ముందు పెట్టేసింది. అంతే అలా చూస్తూ ఇలా ఫిదా అయిపోతున్నారు నేటిజన్లు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.
Tags:    

Similar News