టాలీవుడ్లో ‘నంది’ మంటలు ఇంకా ఆగలేదు. అవి మరింత పెద్దవే అవుతున్నాయి. నిన్న ‘ప్రశ్నించడమే తప్పా’ అంటూ గుణశేఖర్ తెలుగుదేశం ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధిస్తే.. ఇప్పుడు అతడికి ‘రేసుగుర్రం’ సినిమా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి).. వెంకటేశ్వరరావు కూడా తోడయ్యారు. ఈ ముగ్గురూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డుల ఎంపిక తీరును ప్రశ్నించారు.
2014 సంవత్సరానికి ‘రేసుగుర్రం’ హైయెస్ట్ గ్రాసర్ అని.. మరి ఈ చిత్రం ఏ ప్రధాన అవార్డులకూ ఎందుకు నోచుకోలేదని వారు ప్రశ్నించారు. జనం మెచ్చిన సినిమాను ఎలా నిర్లక్ష్యం చేస్తారని ‘రేసుగుర్రం’ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కడుపు మండటం వల్లే ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తోందని వారన్నారు. ‘రేసుగుర్రం’తో పాటు వేరే సినిమాల గురించి కూడా వారు ప్రశ్నలు సంధించారు. ‘మనం’ లాంటి గొప్ప సినిమాను ఉత్తమ చిత్రంగా ఎందుకు ఎంపిక చేయలేదని.. ‘బాహుబలి’ సినిమాకు ప్రభాస్ ఉత్తమ నటుడు అవార్డు ఎందుకివ్వలేదని కూడా అడిగారు. అల్లు అర్జున్ కు తాము ప్రెస్ మీట్ పెడుతున్న విషయం తెలియదని.. తనెక్కడో షూటింగ్ చేసుకుంటున్నాడని బుజ్జి చెప్పాడు. గుణశేఖర్ మాట్లాడుతూ ‘రుద్రమదేవి’కి ఏ అవార్డూ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అల్లు అర్జున్ కు తాము ఉత్తమ సహాయ నటుడి అవార్డు కోసం అడిగితే.. ఉత్తమ క్యారెక్టర్ నటుడి పురస్కారం ఇచ్చారని.. ఇది అవమానకరమని అన్నాడు.
కొంతమంది నిర్మాతలు.. నందుల కోసం రోడ్డున పడకండి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవును.. సి కళ్యాణ్ వంటి వారు అలాంటి కామెంట్లు చేస్తున్నారు. అసలు ముందు మీరు ఒక హిట్టు సినిమాను తీయండి. తీశాక మాకు సలహాలు ఇవ్వండి. ఆ జ్యూరిలో ఉన్నోళ్ళు ఎవ్వరైనా ఏమైనా హిట్టు సినిమాలు తీశారా? వాళ్లకి ఏం అర్హత ఉంది'' అంటూ నిప్పులు చెలరేగారు నిర్మాత నల్లమలుపు బుజ్జి. ఆయన నిర్మించిన 'రేసు గుర్రం' సినిమాకు అవార్డు రాకపోవడం బాధాకరం అంటూ.. ఆయన నంది అవార్డుల పట్ల విముఖత వ్యక్తపరిచారు.
''అసలు మీరు నంది అవార్డులు ఇస్తున్నారా? పంచుతున్నారా? కమ్మ కులానికి ఫేవర్ చేస్తున్నట్లు ఉంది తప్పించి.. ఈ అవార్డుల్లో నిజాయితీయే లేదు. అంతపెద్ద హిట్టయిన సినిమా.. వంద కోట్లు వసూలు చేసిన సినిమా.. అల్లు అర్జున్ అనే పెద్ద స్టార్ హీరో ఒకడు చేసిన సినిమా.. దానికి మీరు నంది అవార్డ్ ఇవ్వరా? ఇంతకంటే పక్షపాతం ఏమన్నా ఉంటుందా?'' అంటూ ప్రశ్నించారు బుజ్జి. అంతేకాదు.. ఆయన తన సినిమా గురించి మాత్రమే కాకకుండా.. రుద్రమదేవి మరియు ఇతర అవార్డుల గురించి కూడా కామెంట్ చేశారు.
''రుద్రమదేవి అంటూ చరిత్ర తీశాడు ఆయన. రేపొద్దున్న శాతకర్ణి సినిమాకు అవార్డులు ఇస్తారేమో కాని.. ఇప్పుడు రుద్రమదేవికి మాత్రం అన్యాయం చేశారు. పైగా ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లు అర్జున్ కు సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ఇవ్వకుండా.. వేరే క్యారక్టర్ నటుడికి ఇచ్చారు. అది కావాలనే చేశారా.. లేదంటే తప్పు జరిగిందో తెలియదు కాని.. అల్లు అర్జున్ ను మాత్రం అవమానించినట్లే. నేను ఈ ప్రెస్ మీట్ కు అవార్డు కావాలని రాలేదు. ప్రజలు గుర్తించినా ప్రభుత్వాలు గుర్తించట్లేదని కడుపు మండి వచ్చాను'' అంటూ బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు.
Full View