మళ్లీ అదే బొద్దందం బాబోయ్!!

Update: 2017-10-02 19:09 GMT
2003లో సొంతం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైనా భామ నమిత. ఆ తర్వాత జెమిని సినిమాలో కూడా నటించి అమ్మడు కుర్రకారును తెగ ఆకట్టుకుంది. అయితే మొదట్లో నాజూకు నడుముతో  ఉండే నమిత తమిళ సినిమాల్లో అలా అడుగుపెట్టింది లేదో చబ్బీ గా కనిపించి ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. లావుగా ఉన్నా కూడా నమితకు తమిళంలో ఆఫర్లు బాగానే వచ్చాయి.

ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా నమితకు మాత్రం కొత్త క్రేజ్ ఏర్పడింది.  దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. గ్యాప్ లేకుండా సినిమాలను తీసింది. ఆ మధ్య తెలుగులో కూడా బిల్లా - సింహ సినిమాల్లో కూడా చబ్బీ అందాలతో కనిపించింది. తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినా కన్నడా - తమిళ్ లో మాత్రం బిజీగానే ఉండేది. అయితే కొన్ని నెలల క్రితం నమిత బరువు తగ్గడానికి వ్యాయామాలను బాగానే చేసింది. దాదాపు 20కేజి లు తగ్గానని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అప్పుడు చాలా అందంగా కనిపించింది.

కాని రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోల్లో మళ్లీ నమిత చబ్బీ గర్ల్ గానే కనిపిస్తోంది. కాకపోతే కాస్త కొత్తగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. అంతే కాకుండా నమితకు బొద్దుగా ఉండడమే ఇష్టంగా ఉన్నట్టుంది అని మరికొందరంటున్నారు. నమిత ప్రస్తుతం పొట్టు అనే తమిళ హర్రర్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా దీపావళికి రానుంది. ఇక నమిత రాజకీయాల్లోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
Tags:    

Similar News