సినిమా తారల మీద అభిమానం వాళ్ళను స్టార్స్ గా మారిస్తే కొందరు ఫ్యాన్స్ లో ఉండే దురభిమానం, అత్యాశ అదే స్టార్స్ కు ప్రమాదంగా కూడా మారుతుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న నమిత అలాంటి సంఘటన ఒకటి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది. 2009లో ఓసారి ఎయిర్ పోర్ట్ లో దిగిన నమిత బయట ఒక వ్యక్తి వచ్చి తను చేస్తున్న సినిమా నిర్మాత పంపించాడు అని చెప్పడంతో ఎక్కువ ఆలోచించకుండా అందులో ఎక్కేసింది. తీరా కొంత దూరం వెళ్ళాక రెగ్యులర్ గా వెళ్ళే రూట్ లో కాకుండా డైవర్షన్ తీసుకున్నాడని గుర్తించిన నమిత అతనికి చెప్పకుండా నిర్మాతకు మెసేజ్ పంపింది. అతను బదులిస్తూ తాను పంపిన మనిషి ఇంకా ఎయిర్ పోర్ట్ దగ్గరే ఉన్నాడని, మీరు ఎక్కిన కారు ఎవరిదో తెలియదని చెప్పడంతో షాక్ తిన్న నమిత అతను తన వైపు అదోలా చూడటం గుర్తించి వెంటనే అలెర్ట్ అయ్యింది.
ఈ లోపు ఆ నిర్మాత పోలీసులకు సమాచారం ఇవ్వడం, నమిత ఎస్ఎంఎస్ ల రూపంలో అతనితో కమ్యునికేట్ చేస్తుండటంతో పక్కా ప్లానింగ్ తో కారును ట్రేస్ అవుట్ చేసి పట్టేసుకున్నారు. ఇది నమిత షేర్ చేసుకున్న షాకింగ్ ఇన్సిడెంట్. ఇందులో అతిశయోక్తి కాని అబద్దం అని చెప్పడానికి అవకాశం లేదు. నమిత చెబుతున్న 2009 టైంలో తన కెరీర్ పీక్స్ లో ఉంది. తమిళ్ లో ఆమెకు ఏకంగా గుడి కట్టేంత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. విక్రం తో చేసిన ఒక్క జెమిని సినిమా తనను స్టార్ ని చేసి పడేసింది. ఆ తర్వాత చేసిన సినిమాలు వరసగా సక్సెస్ కావడంతో తనను కొన్నాళ్ళు పట్టడం కష్టం అయ్యింది.
తెలుగులో కూడా జెమిని రీమేక్ లో వెంకటేష్ సరసన చేసిన నమిత సొంతం లాంటి ఫీల్ గుడ్ మూవీస్ చేసింది కాని అవేవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా తమిళ్ కే అంకితమయ్యింది.ఆ మధ్య బాలకృష్ణ సింహతో రీ ఎంట్రీ ఇచ్చింది కాని బాగా బొద్దుగా మారిపోయి లుక్ మొత్తం చేంజ్ అయిన తనను చూసి మనవాళ్ళు షాక్ తిన్నారు. భర్తతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ సంగతులు బయట పెట్టింది నమిత.