ఎంత క్యూట్ గా ఉన్నారో అంత బుద్ధిగా ఉన్నారు! ఎంత అమాయకంగా కనిపిస్తున్నారో అంత చాకుల్లా కనిపిస్తున్నారు. ఎంతయినా సూపర్ స్టార్ మహేష్ - నమ్రతల వారసులు కదా.. అందుకే ఇంత చక్కగా ఉన్నారన్నమాట! నేడు చదువుల సామి గణేషుడి పూజా పునస్కారాల్లో మునిగి తేలిన గౌతమ్ - సితార ఇదిగో ఇలా ఎంతో పొందిగ్గా కనిపించారు. మొన్ననే గౌతమ్ డాడ్ మహేష్ తో ఫైటింగ్ కూడా చేశాడు. సితార అయితే వీలున్నప్పుడల్లా రెండు జడలతో ఫన్నీగా నవ్వేస్తూ సైలెంట్‌గా అల్లరి చేస్తుంటుంది.
ఇంతకీ బొజ్జ గణపయ్యను ఏమని కోరారో కానీ, వీళ్ల ప్రోగ్రెస్ రిపోర్టుల్ని పరిశీలిస్తే కానీ తెలీదు. క్లాసులోనూ గౌతమ్ - సితార ఇంతే బుద్ధిగా ఉంటారని ఇప్పటికి గణేషుని సాక్షిగా నమ్మాలి. తోటి పిల్లలతో కలిసి ఎంచక్కా చదువును కొనసాగిస్తున్నారు. కానీ మునుముందు మరీ అంత స్వేచ్ఛ ఉండదు. ఎంతయినా ఒక సూపర్‌స్టార్ పిల్లలు కదా.. ఆ మేరకు పబ్లిక్ నుంచి ఒత్తిడి ఉంటుంది. గణేషుని ఆశీస్సులతో బుద్ధిగా చదువుకుని అటుపై మామ్ - డాడ్ లెగసీని, ఘట్టమనేని లెగసీని కాపాడేందుకు వార్ మొదలు పెట్టాల్సి ఉంటుంది.
లార్డ్ గణేషుని ఆశీస్సులతో చదువుల్లో రాణించాలి. అటుపై నటవారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి. తాత ఘట్టమనేని కృష్ణ అంత ఖ్యాతిని ఘడించి - డాడ్ మహేష్ అంతటి స్టార్‌డమ్‌ని అందిపుచ్చుకుని గౌతమ్ కూడా ఎదిగేయాలి. ఇక సితార సైతం తాను ఎంచుకున్న రంగంలో అంతే పెద్దగా ఎదిగేయాలని గణపతి ఆశీస్సులు అందించారన్నమాట. ఫిలింనగర్‌లోని ఇంట్లోనే దేవుని గదిలో ఇలా ప్రత్యేకంగా వినాయకుని విగ్రహానికి పూజలు పునస్కారాలు ఆచరించారన్నమాట.