సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి చిత్రం ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఎప్పటికప్పుడు ట్రేడ్ రిపోర్టులు అందుతున్నాయి. క్రిటిక్స్ వైపు నుంచి మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే సక్సెస్ వేదికపై మహేష్ ఎన్నడూ లేని విధంగా తొలిసారి తన మాస్ ఫ్యాన్స్ ని తలచుకుంటూ కాలర్ ఎగురవేశారు. మొదటి వారంలోనే నా సినిమాల రికార్డులన్నిటినీ మహర్షి చిత్రం బ్రేక్ చేస్తోందని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
ఇదివరకటితో పోలిస్తే మహేష్ లో ఈ మార్పు ఊహించనిది. సినిమాల బిజినెస్ .. ట్రేడ్ లెక్కల గురించి ప్రస్థావించేందుకు కెరీర్ 24 సినిమాల జర్నీలో ఏనాడూ ఇష్టపడని మహేష్ తొలిసారి 25వ సినిమా బిజినెస్ గురించి.. వసూళ్ల గురించి లెక్కల్ని చెబుతున్నారు. ఈ జోష్ లో ఇటు తెలుగు మీడియా.. అటు బాలీవుడ్ మీడియాకి మహేష్ టచ్ లో ఉన్నారు. ఓ పద్ధతి ప్రకారం అటు బాలీవుడ్ మీడియాలోనూ ఇంటర్వ్యూల పేరుతో వేడెక్కిస్తున్నారు మహేష్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ చేసిన ఓ రెండు కామెంట్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి.
నా కెరీర్ లో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని మహర్షి చిత్రం బ్రేక్ చేస్తోంది. అన్నిటినీ దాటుకుని ముందుకు వెళుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ ని అందుకుని దూసుకెళుతోందని మహేష్ స్వయంగా చెప్పడం విశేషం. మహేష్ కెరీర్ జర్నీలో నమ్రత పాత్ర ఎంత? అన్న ప్రశ్నకు... నా భార్య నా బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. నేను సందిగ్ధతలో ఉన్నప్పుడు తనే ఇనిషియేషన్ తీసుకుని తనని ముందుకు నడిపించిందని మహేష్ వెల్లడించారు. కెరీర్ లో స్పైడర్ .. బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్ లు వచ్చినప్పుడు నమ్రత మహేష్ కి అండగా నిలిచి శ్రీమంతుడు .. భరత్ అనే నేను.. మహర్షి లాంటి ఎంపికలు చేశారని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇక సితార.. గౌతమ్ గురించి చెబుతూ .. మహర్షి చిత్రాన్ని మా ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసింది సితార. తన ప్రతి ఫీలింగ్ జెన్యూన్. తన ఎమోషన్ జెన్యూన్ అని అన్నారు. గౌతమ్ ని చూస్తే గర్వంగా ఉంటుందని మహేష్ తెలిపారు.