మహేష్ నమ్రతల ఎగ్జామ్ మార్క్స్

Update: 2018-12-24 05:58 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలతో అభిమానులను ఎంతగా అలరిస్తాడో అదే సమయంలో భార్య నమ్రత ద్వారా తన వ్యక్తగత విషయాలనూ షేర్ చేసుకుంటూ వారితో రెగ్యులర్ టచ్ లో ఉంటాడు. దీనికి గాను ఈ స్టార్ కపుల్ ను మెచ్చుకోవాల్సిందే. విదేశాలకు వెళ్ళినా స్థానికంగా ఉన్నా ఎప్పటికప్పుడు తమ లైఫ్ లోని ముఖ్య ఘట్టాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకునేందుకు వీరెప్పుడు మొహమాట పడరు. అందుకే టాలీవుడ్ లో వన్ అఫ్ ది బెస్ట్ కపుల్ గా మహేష్ నమ్రతలకు పేరుంది.

మహేష్ సినిమాలకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలన్నీ నమ్రతానే చూసుకుంటుందన్న విషయం ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఒక ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ జంట ఒక సరదా పరీక్షను ఎదురుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా మహేష్ కు యాక్టర్ గా మీరెన్ని మార్కులు వేస్తారని నమ్రతను ప్రశ్నిస్తే పదికి పది అంటూ ఎక్కువ ఆలస్యం చేయకుండా చెప్పేసింది. అదే మహేష్ తో మీకు మీరు ఎంత వేసుకుంటారు అని అడిగితే ఓ మూడు తగ్గించుకుని ఆరు లేదా ఏడు అని చెప్పేసాడు.

ఇదే ప్రశ్న ఒక భర్తగా ఎంత ఇస్తారు అంటే నమ్రత ఈసారి కూడా అదే నెంబర్ చెప్పింది. అయితే ఇలా ఫుల్ మార్క్స్ ఇవ్వడంలో తానేమి నిజాలు దాచడం లేదని మనస్పూర్తిగా చెబుతున్నాను అని చెప్పడం గమనార్హం. దీనికీ ,మహేష్ ఏడునే వేసుకున్నాడు. ఇక పిల్లలకు తండ్రిగా అన్న క్వశ్చన్ కు మాత్రం నమ్రత ఏకంగా పదికి ఇరవై ఇచ్చేయగా మహేష్ కూడా పది పదికి వేసేసుకున్నాడు. అంటే నటన భార్య భర్తల బంధం పక్కన పెట్టి చూస్తే ఈ ఇద్దరికీ పిల్లల మీద ఎంత అఫెక్షన్ ఉందొ అర్థమవుతోంది కదా.
    

Tags:    

Similar News