షాక్‌: బాలీవుడ్ డ్ర‌గ్స్ లింకులో న‌మ్ర‌త పేరు!!

Update: 2020-09-22 16:00 GMT
బాలీవుడ్ లో మాద‌క ద్ర‌వ్యాల(డ్ర‌గ్స్)‌ తీగ లాగితే డొంకంతా క‌దులుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్.సి.బి విచార‌ణ‌లో ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల పేర్లు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం సంచ‌ల‌న‌మైంది. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువ‌డ్డాయి.

ఇక ఎన్సీబీ ట్రాకింగ్ లో జ‌య‌సాహాతో న‌మ్ర‌త చాటింగు బ‌య‌ట‌ప‌డింద‌ని ఈ క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక ఇంత‌కుముందు ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపించ‌గా దానిపై ర‌కుల్ కోర్టును ఆశ్ర‌యించ‌నున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. తాజా ప‌రిణామంతో టాలీవుడ్ లోనూ దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ నటులు.. డ్రగ్స్‌ పెడ్లర్లను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారిస్తోంది. ఇక ఇదే విచార‌ణ‌లో క‌థానాయిక దియా మీర్జా  పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ అధికారులు దియాను.. ఆమె మేనేజర్‌ను విచారించేందుకు అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. 2019లో దియా డ్రగ్స్‌ తీసుకున్నార‌ని.. త‌న‌కు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు డ్రగ్‌ డీలర్స్‌ అధికారుల విచారణలో వెల్లడించార‌ని క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌న‌మైంది.



Full View
Tags:    

Similar News