బాలయ్యతో కొట్టించుకుని ఆనందిస్తారట

Update: 2017-09-03 09:33 GMT
నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ రిలీజ్ సందర్భంగా ఆయన బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రధాన మీడియాలకు బోలెడన్ని ముచ్చట్లు చెప్పేస్తున్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే ప్రశ్నలకు తన స్టైల్ లోనే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు బాలకృష్ణ.

ఈ మధ్య ఫ్యాన్స్ ను బాలయ్య కొట్టుడు వ్యవహారం కాస్త ఎక్కువగానే మీడియాలోనే నానింది. సోషల్ మీడియా విస్తృతం అవడంతో.. ఈ సంఘటనలకు ప్రచారం ఎక్కువగానే జరిగింది. వీటిపై కూడా తన సినిమాలోనే "పది మందికి పెట్టాలన్నా మేమే.. నలుగురిని కొట్టాలన్నా మేమే" అంటూ డైలాగ్ పలికారు  బాలయ్య. ఇప్పుడు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరింత డీటైల్డ్ గా ఈ సంఘటన గురించి ఎక్స్ ప్లెయిన్ చేశారాయన. "రాసే వాళ్లకేం తెలుసు.. వాళ్ల బొంద. అందులో ఎంత ప్రేమ ఉంటుందో ఫ్యాన్స్ ను అడగండి. నన్ను ఇక్కడ కొట్టాడ్రా బాలయ్య అని చెప్పుకుని మురిసిపోతారు" అనేశారు బాలయ్య.

అంతే కాదు.. తనకు తన ఫ్యాన్స్ మధ్య ఔట్ సైడర్స్ నాట్ ఎలోడ్ అంటూ సినిమా డైలాగ్ ను కూడా రిపీట్ చేశారు. ఇలా సింగిల్ డైలాగ్ లో ఆయన కొట్టుడు వ్యవహారాన్ని రాసిన రైటర్స్ కు పంచ్ ఇవ్వడమే కాకుండా.. కొట్టించుకున్న వాళ్లంతా నావాళ్లే అన్నటైపులో డైలాగ్ చెప్పి సముదాయించేశారు. అంతా బాగానే ఉంది కానీ.. కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా రాజకీయ నాయకుడిగా ఉన్న బాలకృష్ణ.. పబ్లిక్ తో ప్రవర్తించేటపుడు కాసింత అయినా కంట్రోల్ లో ఉండాలి కదా అంటూ వినిపిస్తున్న వాదన కూడా కొట్టిపారేయలేం.

Full View
Tags:    

Similar News