ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఏ కాంబినేషన్ ఎందుకు సెట్టవుతుందో కూడా చెప్పలేం. ఇంతకుముందు మహేష్ - వెంకటేష్.. పవన్ కల్యాణ్ - వెంకటేష్.. అమితాబ్ -చిరంజీవి కాంబినేషన్స్ అలానే కుదిరాయి. ఇటీవలి కాలంలో భారీ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ మల్టీస్టారర్లుగా తెరకెక్కుతున్నాయి. బహుభాషా నటీనటులను కలుపుకుని మన దర్శకనిర్మాతలు అసాధారణ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మునుముందు సర్ ప్రైజింగ్ కాంబినేషన్స్ కి ఆస్కారం లేకపోలేదని పలువురు జోశ్యం చెబుతున్నారు. తాజాగా అఖండ సక్సెస్ ఈవెంట్లో బోయపాటి చేసిన ప్రకటన అంతే ఆశ్చర్యపరిచింది. సమీప భవిష్యత్ లో నందమూరి బాలకృష్ణ- అల్లు అర్జున్ కలిసి మల్టీస్టారర్ నటించే అవకాశం ఉందా? అంటూ బోయపాటిని ప్రశ్నించగా.. ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు. కానీ దానికి సమయం రావాలి.. అని గుంబనగా వ్యాఖ్యానించారు. దీనర్థం బన్ని-బాలయ్య కలయికలో సినిమా తెరకెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదనే.
ఆసక్తికరంగా ఇటీవలి కాలంలో బన్ని- బాలయ్య మధ్య సాన్నిహిత్యం పరిశ్రమలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. అల్లు అర్జున్ అఖండ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాగా.. ఆ తర్వాత ఆహా సెలబ్రిటీ టాక్ షో - అన్‌స్టాపబుల్ లో బాలయ్య హోస్ట్ గా కొనసాగినప్పుడు వారి మధ్య అన్యోన్యత అందరికీ అర్థమైంది. అల్లు అర్జున్ - బాలకృష్ణ పరస్పర గౌరవాన్ని కలిగి ఉన్నారు. అంతేకాదు బోయపాటి శ్రీనుకు ఆ ఇద్దరితో చక్కని సత్సంబంధాలున్నాయి. బన్నీతో సరైనోడు తీసిన బోయపాటి బాలయ్యతో వరుస చిత్రాలు తీస్తున్నారు. అందువల్ల ఆ ఇద్దరినీ కలిపి సినిమా తీసే గట్స్ తనకే ఉన్నాయని అంతా భావిస్తున్నారు.
అయితే పరిశ్రమలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇక్కడ ఎవరు ఎవరిని ట్రాక్ లోకి తెస్తారో చెప్పలేం. ఆకస్మికంగా పుష్ప - 1 సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 చిత్రీకరణకు సిద్ధమవుతున్న సుకుమార్ తదుపరి సీక్వెల్లో బాలకృష్ణను అత్యంత ప్రాధాన్యత ఉన్న ఓ కీలక పాత్రలో నటింపజేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ ఎప్పుడు ఏది అయినా జరగొచ్చని బోయపాటి అన్నదానికి రుజువుగా ఇది నిలిచిపోవచ్చు కూడా. ఎన్బీకే తదుపరి గోపిచంద్ మలినేని- అనీల్ రావిపూడి వంటి దర్శకులతో సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే.