నందమూరి అభిమానులంతా ఇప్పుడు 'అఖండ' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన బోయపాటితో రెండు హిట్ల తరువాత చేయడం .. రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనుండటం ఈ సినిమాకి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఈ సినిమాలో రైతుగాను .. అఘోరగాను బాలకృష్ణ కనిపించనున్నారు. గతంలో గ్రామీణ నేపథ్యంలోని కథల్లో బాలకృష్ణ రైతుగా కనిపించారు. కానీ ఆయన అఘోరాగా కనిపించనుండటం ఇదే మొదటిసారి. అందువలన అభిమానులు కుతూహలంతో ఉన్నారు.
మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ కనువిందు చేయనుండగా, పవర్ఫుల్ ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమాను దసరా పండుగకి విడుదల చేయాలనే అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అనుకున్న సమయానికి షూటింగు పూర్తికాకపోవడం వలన కుదరలేదు. ఇక దీపావళికి వస్తుందేమోనని అభిమానులు ఆశపడ్డారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్లో రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆంధ్ర .. నైజామ్ .. సీడెడ్ ఏరియాల్లో మంచి బిజినెస్ జరుపుకుంది. నైజామ్ ఏరియాకు సంబంధించిన హక్కులను సాయి కొర్రపాటి - ఎన్వీ ప్రసాద్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు తమ వైపు నుంచి ఉన్న సమస్యలను చెబుతూ .. కాస్త తగ్గించమని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో ముందుగా రిలీజ్ డేట్ వేసేసి .. ఆ తరువాత చర్చలు మొదలుపెట్టాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టుగా చెబుతున్నారు.
సాధ్యమైనంత వరకూ ఈ సినిమాను డిసెంబరులోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. అదీ డిసెంబర్ 2వ తేదీని ఖరారు చేయడం ఖాయమనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇక్కడ 'అఖండ'కు ఇంతవరకైతే గట్టిపోటీ ఏదీ లేదు. డిసెంబర్ 3వ తేదీన వరుణ్ తేజ్ 'గని' మాత్రమే విడుదల కానుంది. కనుక డిసెంబర్ 2ను దాదాపు ఖాయం చేయవచ్చని అనుకుంటున్నారు. బాలకృష్ణకి కొంత కాలంగా సరైన హిట్ పడలేదు. ఇక బోయపాటికి కూడా 'సరైనోడు' తరువాత సరైన హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో ఇది ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా అయింది. హ్యాట్రిక్ హిట్ కోసం అవతల అభిమానుల వెయిటింగ్. ఏం జరుగుతుందో చూడాలి మరి.