భారం మొత్తం అభిమానులదే

Update: 2019-02-28 11:17 GMT
ఎన్టీఆర్ మహానాయకుడు ఫలితాన్ని కాసేపు పక్కన పెడితే అసలు కరుడు గట్టిన వీరాభిమానులు సైతం దీన్ని ఎందుకు దూరం పెట్టారన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఫలితం ముందే ఊహించారో లేక వాస్తవాలు ఉండవనే ఫీలర్ ముందుగానే వచ్చిందో తెలియదు కానీ రెండు నెలల్లో రెండు డిజాస్టర్లు బాలకృష్ణ అందుకోవడం వాళ్లకు ఎంత మాత్రం సహించడం లేదు.

పైగా ఎన్టీఆర్ బయోపిక్ సోషల్ మీడియాలో మాములు ట్రాలింగ్ కు గురి కాలేదు. విపరీతంగా ఆడేసుకున్నారు. కలెక్షన్ల ఫిగర్స్ బయటికి వచ్చాక వీటికి మరింత ఊతమొచ్చింది. ఇదిలా ఉండగా దీన్నుంచి రిలీఫ్ కావాలి అంటే అర్జెంటు గా నందమూరి క్యాంప్ కు ఒక గట్టి హిట్టు పడాలి. రేపు రానున్న కళ్యాణ్ రామ్ 118 మీదే వాళ్ళ ఆశలన్నీ ఉన్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దీనికి బజ్ కనిపించడం లేదు. పబ్లిక్ లో ఆసక్తి రేగేలా తగినంత ప్రమోషన్ చేయడంలో టీమ్ ఫెయిల్ కావడంతో చాలా చోట్ల బుకింగ్స్ మందకొడిగా ఉన్నాయి.

ఏ స్క్రీన్లోనైనాఈజీ గా టికెట్లు దొరికే పరిస్థితి నెలకొంది. ఇది పొరపాటున హ్యాట్రిక్ డిజాస్టర్ కొట్టిందా అంతే సంగతులు. లేదూ సినిమా బాగుంది అనే టాక్ వస్తే దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఫాన్స్ కే ఎక్కువగా ఉంటుంది. 118 ఇలా ఫోకస్ కావడానికి మరో కారణం దగ్గర్లో ఇంకే నందమూరి సినిమా లేదు. బోయపాటి శీను బాలకృష్ణల కాంబో మూవీ ఇంకా మొదలుపెట్టనే లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి గాను రాదు. సో 118 ఏదైనా విజయం సాధించితే కొంత రిలాక్స్ అవ్వొచ్చని అభిమానుల ఆశ. తీరుతుందో లేదో రేపీపాటికి తెలిసిపోతుందిగా
    

Tags:    

Similar News