ఇప్పుడు స్టార్స్ ఎదురుచూపులన్నీ బాలయ్య పైనే..

Update: 2020-04-23 11:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 'బి ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది. అంటే ఇంట్లో పనులు చేయడం, భార్యలకు వంటింట్లో సహాయం చేయడం లాంటివి అన్నమాట. ఈ ఛాలెంజ్ ని మొదటగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించారు. ఆయన ఇంట్లో అన్నీ పనులు చేసి దర్శక ధీరుడు రాజమౌళిని నామినేట్ చేసాడు. ఆ తర్వాత రాజమౌళి కూడా ఇంటి పనులు చేసి 'బి ది రియల్ మ్యాన్' అనిపించుకుని.. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ - సుకుమార్ - నిర్మాత శోభులకు నామినేట్ చేసాడు. ఇప్పుడు ఈ సర్కిల్ అందరి వైపు తిరుగుతుంది. ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్ ఇంటి పనులన్నీ చేసి టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలైన చిరంజీవి - నాగార్జున - బాలయ్య - వెంకటేష్‌ ను నామినేట్ చేసాడు.

ఇప్పటికే రాంచరణ్ - సుకుమార్ ఈ ఛాలెంజ్ పూర్తిచేశారు. డైరెక్టర్ కొరటాల శివ పూర్తిచేసి యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఛాలెంజ్ విసిరారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నిన్నటి నుండి అభిమానులను సినీ ప్రముఖులను వెయిట్ చేయించి ఈరోజు ఆయన ఛాలెంజ్ ని పూర్తిచేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఛాలెంజ్ ని స్వీకరించిన విక్టరీ వెంకటేష్ కూడా అదే పనిలో ఉన్నారు. కానీ నటసింహం బాలయ్య బాబు నుండి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. టాలీవుడ్ స్టార్స్ తో పాటు సినీ ప్రేక్షకులంతా బాలయ్య బి ది రియల్ మ్యాన్ వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి బాలయ్య బాబు ఎలా సర్ ప్రైజ్ చేస్తారో..
Tags:    

Similar News