టైటిల్ చూడగానే బాలకృష్ణ నటించిన సీత రామ కళ్యాణం సినిమాలోని పాటలా అనిపిస్తున్నా ప్రస్తుతం ఇది సినిమా టైటిల్ గా రానుంది. ఈ మధ్యకాలంలో ఈ ఒరవడి బాగానే పుంజుకుంటోంది. అందులోనూ సినిమా టైటిల్ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. పూరి జగన్నాధ్ సినిమా టైటిల్ల విషయంలో తిట్లదే అగ్ర తాంబూలమని అందరికీ తెలిసిందే. వంశీ సినిమా పేర్లయితే ఏకంగా ఒక వాఖ్యంతో చాంతాడంత పొడుగుంటాయి. అలానే తనకంటూ టైటిల్ విషయంలో ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి.
అలా మొదలయింది సినిమా సమయానికి నానికి ఇప్పుడున్న ఇమేజ్ లేదు. నిత్య మీనన్ ఎవరో కూడా తెలీదు. కేవలం తన సినిమా పేరుతోనే ప్రేక్షకులను ఆకర్షించింది నందినీ రెడ్డి. సినిమా హిట్ అవడంతో తన కెరీర్ కూడా బాగానే మొదలయింది అనుకున్నా రెండో సినిమా ఫలితంగా దాదాపు రెండు సంవత్సరాల వరకూ మరో సినిమా తెరమీద దర్శనమివ్వలేదు. తాజాగా నాగశౌర్య, ఎవడే సుబ్రహ్మణ్య నాయిక మాళవిక నయ్యర్ హీరోయిన్ గా తన శైలో ఓ ప్రేమ కథను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి కూడా కళ్యాణ వైభోగమే లాంటి భిన్నమైన టైటిల్ నేఎంచుకుంది నందినీ రెడ్డి. ప్రేమకథలలో ఇమిడిపోయే శౌర్యను హీరోగా తీసుకున్న ఈ మహిళా దర్శకురాలు ఫలితం మొదటి సినిమాలానే రావాలని అలా మొదలైంది బృందం కె.ఎల్.దామోదర ప్రసాద్ (నిర్మాత), కళ్యాణ్ కోడూరి (సంగీత దర్శకుడు)తోనే ఈ సినిమా చేస్తోంది. అంతిమ ఫలితం ప్రేక్షకాధీనమే అనుకోండి.