‘అలా మొదలైంది’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. ఐతే ఆ సినిమాతో వచ్చిన మంచి పేరంతా రెండో సినిమా ‘జబర్దస్త్’తో పోగొట్టుకుంది నందిని. సినిమా ఫ్లాప్ కావడం కంటే కూడా ‘బ్యాండ్ బాజా బారత్’ను యథాతథంగా దించేయడంతో ఆమె మీద తీవ్ర విమర్శలొచ్చాయి. దెబ్బకు మళ్లీ ఇంకో అవకాశం దక్కించుకోవడానికి చాలా టైం పట్టింది.
తొలి సినిమా తీసిన ‘రంజిత్ మూవీస్’ బేనర్లోనే మళ్లీ ఛాన్స్ అందుకుని ‘కళ్యాణ వైభోగమే’ తీసింది నందిని. మొదట్నుంచి ఈ సినిమా విషయంలో ఓ పాజిటివ్ ఫీలింగ్ ఉంది జనాల్లో. ప్రోమోస్ అన్నీ కూడా అంత ఆసక్తికరంగా అనిపించాయి. కళ్యాణి మాలిక్ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉన్న ఈ టైంలోనే రిలీజ్ చేసేస్తే పోయేది కానీ.. ఎందుకనో వాయిదా వేసేశారు.
జనవరి 22నే వస్తుందనుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అసలు సినిమాను ఏ రకంగానూ ప్రమోట్ చేయకుండా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఇది మంచి సీజన్ కాదని ఆగుతున్నారో లేక బిజినెస్ విషయంలో ఏమైనా తేడాలున్నాయో ఏమిటో. ఏదేమైనా సినిమా తీయడం కంటే సరైన టైమింగ్ లో రిలీజ్ చేసుకోవడం కీలకంగా మారిన ఈ రోజుల్లో సాధ్యమైనంత త్వరగా విడుదలకు ముహూర్తం చూసుకుంటే బెటరేమో.