హార్ట్ టచ్చింగ్ లవ్... కన్నుల్లో నీరూపమే!

Update: 2017-01-01 06:56 GMT
యువ‌ హీరో నందు త‌న కొత్త‌ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం క్యారెక్ట‌ర్ న‌టుడిగానూ... మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టిస్తూ వ‌స్తున్న నందు.. తొలిసారిగా సోలో హీరోగా న‌టిస్తున్నాడు. ఆ చిత్రం పేరు కన్నుల్లో నీరూపమే. ఇది టాకీ పార్టు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమైంది. ఫొటో.. 100%లవ్... ఆటోనగర్ సూర్య.. 365 డేస్.. లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఇప్పుడు ఈ హార్ట్ టచ్చింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్  తో వస్తున్నాడు. ఇప్పటిదాకా విభన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నందు ఈసారి కాస్త రూటు మార్చి కొంచెం కామెడీ టచ్ ఉన్న రోల్ ట్రై చేస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏ.ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ బాసాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ భామ తేజస్వి ప్రకాష్  హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నందు కెరిర్ లోనే భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేటును నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌నున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News