నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికి` చిత్రం తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే. ఇందులో సుందరానికి జోడీగా మలయాళం బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో నాని బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ రివీల్ అయ్యాయి.
హైదరాబాద్ లో ని ఓ పాతకాలపు ఇంట్లో సగం షూటింగ్ పూర్తిచేసారు. వెస్ట్ మారేడు పల్లిలోని ఉన్న 90 ఏళ్ల కాలం పరిస్థితులకు అనుగుణంగా ఇంటికి మేకోవర్ చేసారు. సన్నివేశాలు వాస్తవంగా ప్రామాణికంగా ఉండాలని దర్శకుడు ఆ కాలం నాటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ ఇదే ఇంట్లో చేసారు. 40-50 శాతం షూటింగ్ ఇక్కడే చేసారుట. నాని సహా సినిమాలో కీలకమైన నటీనటులపై ఆ ఇంట్లోనే సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఇంటి మేకోవర్ కోసం యూనిట్ బాగానే శ్రమించింది. ప్రొడక్షన్ డిజైనర్ లతా నాయుడు కంటున్యూటీ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా కొన్నిసెట్లను సైతం సిద్దంచేయడం..ఆర్ట్ వర్క్ లో కీలకపాత్ర పోషించారు. కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ షూట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదుని తెలుస్తోంది. దశల వారీగా ఇదే ఇంట్లో షూటింగ్ చేసారు. అంటే సుందరం ఎంత పాత మనిషిగా కనిపిస్తాడో ఊహించొచ్చు.
90 ఏళ్ల నాటి సుందరాన్ని తెరపై 2022లో చూడబోతున్నాం. ఆ ఇంటి కోసం దాదాపు మూడు నెలలు పాటు టీమ్ అన్వేషించగా దొరికిందిట. సుందరం కథకి..పాత్రకి ఆ ఇల్లు అయితేనే పక్కాగా సూటవుతుందని భావించి 90 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదటి రోజున నాని ఆ ఇంటిని చూసి పర్పెక్ట్ ఛాయిస్ అని భావించాడుట.
సినిమాలో ఆ ఇల్లు ప్రత్యేక ఆకర్ఫషణగా నిలుస్తుందని టీమ్ చెబుతుంది. మరి ఆ ప్రత్యేకత ఎంత సర్ ప్రైజ్ గా ఉటుందో తెలియాలంటే జూన్ 10 వరకూ వెయిట్చేయాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది.