నజ్రియా స్టుపిడ్.. నాని అంత మాట అన్నాడంటే..

Update: 2022-12-21 02:30 GMT
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఇటీవల కాలంలో అతను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరం అవుతున్నాడు. అప్పుడప్పుడు ప్రేక్షకులను ఎప్పటిలానే ఆకట్టుకునే విధంగా కామెడీ సినిమాలు చేసినప్పటికీ కూడా
అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటున్నాడు.

మొత్తానికి నాని రేంజ్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది. అతను కూడా పాన్ ఇండియా బాటలో నడవాలని అనుకుంటున్నాడు. ఇక నాని అయితే ఇటీవల నిర్మాతగా కూడా హిట్ 2తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండే నాని హీరోయిన్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే.

అయితే నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని పోస్టులు కూడా విభిన్నంగా ఉంటాయి. రీసెంట్ గా అతను నజ్రియా ఫోటోను పోస్ట్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పి ఒక మాట అనేసాడు. హ్యాపీ హ్యాపీ బర్తడే స్టుపిడ్ అంటూ త్వరలోనే కలవాలి అని మెన్షన్ చేశాడు. నాని ఆమెకు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో స్టుపిడ్ అనే మాటతో అర్థమైంది. నాని తో సినిమా చేసిన ఏ హీరోయిన్ అయినా సరే చాలా మంచి స్నేహితురాలుగా మారిపోతుంది.

అంతే కాకుండా నాని భార్యతో కూడా హీరోయిన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక నజ్రియాకు బర్త్ డే విషెస్ అందిస్తూ నాని తన భార్య ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ఇక నాని మరోవైపు దసరా సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా తెరపైకి తీసుకురాబోతున్నాడు. నాని కెరిర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న దసరా సినిమా 2023 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News