హీరో నాని ఇప్పుడు టాప్ పేస్ లో ఉన్నాడు. నాని కనిపిస్తే చాలు.. సినిమాకు బోలెడన్ని కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. యంగ్ హీరోస్ లో అందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని.. నేచురల్ స్టార్ అనిపించుకుంటున్న నాని.. రీసెంట్ గా నేను లోకల్ మూవీతో తన సత్తా చూపించాడు.
ప్రొఫెషనల్ గా పీక్ స్టేజ్ లో ఉన్న నానికి.. పర్సనల్ గా కూడా ఇప్పుడు బోలెడంత సంతోషం కలిగించే రోజు ఇది. ఉగాది పండుగ రోజున నాని దంపతులకి చిన్నారి మగబిడ్డ జన్మించాడు. నాని భార్య అంజలి యెలవర్తి.. ఇవాళ ఉదయం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నాని కుటుంబం అంతా ఇప్పుడు బోలెడంత సంతోషంలో మునిగిపోయింది. పండుగ రోజునే ఇంటికి కొత్త అతిథి రావడంతో.. సంబరాల్లో మునిగిపోయారు ఫ్యామిలీ అంతా.
2012 అక్టోబర్ 27న నాని వివాహం కాగా.. ఇప్పుడు వీరికి తొలి సంతానం కలిగింది. ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరడంలో నాని స్వయంకృషి ఎంతో ఉంది. అలాగే ఎవడే సుబ్రమణ్యం నుంచి ఇప్పటివరకూ వరుసగా ఆరు సూపర్ హిట్స్ కొట్టేసి.. నాని తన రేంజ్ చూపిస్తున్నాడు కూడా. బుల్లి నాని ఎంట్రీతో.. పెద్ద నాని భలే సంతోషంగా ఉన్నాడిప్పుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/