ఏ కథ ఎక్కడ మొదలై.. ఎవరి వద్దకు చేరుతుందో.. ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక హీరో చేయాలనుకున్న కథలు మరో హీరో వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్లుగా మారిన సందర్భాలు చాలా వున్నాయి. అంతే కాకుండా చిన్న కథగా.. చిన్న హీరోతో మినిమమ్ బడ్జెట్ లో చేయాలనుకున్న సినిమాలు కూడా అనూహ్యంగా పెద్ద కథలుగా మారి.. పెద్ద హీరోల వద్దకు వెళ్లడం ఈ మధ్య కాలంలో జరుగుతోంది. చిన్న హీరో.. మినిమమ్ బడ్జెట్ లో చేయాలనుకున్న ఓ కథ ఓ మేకప్ మెన్ కారణంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని తొలి సారి ఊర మాసీవ్ పాత్రలో తెలంగాణ యాసలో సాగే పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ `దసరా`. సుకుమార్ తో పాటు పలువురు స్టార్ డైరెక్టర్ల వద్ద వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా రికార్డు సాధించిన ఈ మూవీని 2023 మార్చి 30న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా రూ. 45 కోట్ల మేర రాబట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది.
ముందు ఈ మూవీకి హీరో నాని కాదని తెలిసింది. దర్శకుడిగా పరిచయం కావాలన్న ప్రయత్నాల్లో వున్న శ్రీకాంత్ ఓదెల మొదటి ఈ కథని ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ తో అనుకున్నాడట. మినిమమ్ బడ్జెట్ తో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేశాడట. కానీ ఎందుకో అది వర్కవుట్ కాకపోవడం..ఓ మేకప్ మెన్ దృష్టిలో పడటంతో ఈ కథ కాస్త నిర్మాత చెరుకూరి సుధాకర్ వద్దకు వెళ్లిందట. స్టోరీ విన్న చెరుకూరి సుధాకర్ డెమో తీసుకురమ్మని బడ్జెట్ ఇచ్చాడట.
శ్రీకాంత్ ఓదెల చేసిన డెమో వీడియో టెర్రిఫిక్ గా వుండటంతో ఈ ప్రాజెక్ట్ ని నానితో చేద్దామని చర్చలు మొదలయ్యాయట. నానికి శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ, తీసిన డెమో వీడియో నచ్చడంతో చిన్న బడ్జెట్ లో చిన్న హీరోతో చేయాలనుకున్న ఈ మూవీ కాస్తా ఇప్పడు పాన్ ఇండియా మూవీగా మారడం విశేషం. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వెనకున్న కథ తెలిసిన వాళ్లంతా ఇప్పడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. టైమ్ ఎప్పుడు ఎవరిని ఎక్కడకు తీసుకెళుతుందో చెప్పడం కష్టం అనేది శ్రీకాంత్ ఓదెల `దసరా` జర్నీ తో మరోసారి రుజువు కావడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.